అక్క‌డి తమ్ముళ్ళు ఎక్కడ?

ఈ ప్రశ్న బయట నుంచి రావడంలేదు. సొంత పార్టీ నుంచే తమ్ముళ్ళు సొంత పార్టీ నుంచే తమ్ముళ్ళు  నుంచే వస్తోంది.  జెండా పట్టుకున్న పార్టీ  కార్యకర్త నుంచి వస్తోంది. కరోనా వైరస్ వంటి మహమ్మారి…

ఈ ప్రశ్న బయట నుంచి రావడంలేదు. సొంత పార్టీ నుంచే తమ్ముళ్ళు సొంత పార్టీ నుంచే తమ్ముళ్ళు  నుంచే వస్తోంది.  జెండా పట్టుకున్న పార్టీ  కార్యకర్త నుంచి వస్తోంది. కరోనా వైరస్ వంటి మహమ్మారి దేశంలో ఉంటే తమను ధైర్యం చెప్పి నాయకత్వం వహించాల్సిన నాయకులు  ఎక్కడ అని పసుపు పార్టీ క్యాడర్ దివిటీలు పెట్టి మరీ  వెతుక్కుంటోంది.

శ్రీకాకుళం జిల్లా టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతం. జగన్ ప్రభంజనం ఉత్తరాంధ్రా అంతటా వీచినా కూడా శ్రీకాకుళంలో ఒక ఎంపీ సీటు, రెండు ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుందంటే ఇంకా సైకిల్ పార్టీ మీద అక్కడక్కడ  ఉన్న అభిమానమే కారణం.

మరి అటువంటి సిక్కోలుకు తమ్ముళ్ళు ఏం చేశారు, కరోన వణికిస్తున్న వేళ ఎంతమేర‌కు ఆదుకున్నారు అన్నది చూస్తే పెద్ద ఎత్తున విమర్శలే వినిపిస్తున్నాయి.  ఒక్క ఎంపీ రామ్మోహనరావు తప్ప మిగిలిన నేతలు అయిపూ అజా లేరు. ఇందులో మాజీ మంత్రులు, సామంతులు కూడా ఉన్నారు.

లాక్ డౌన్ ప్రకట నుంచి  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విశాఖలోనే మకాం వేశారని అంటున్నారు. ఆయన అక్కడ నుంచే అపుడపుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీటుతూంటారు. మరో బడా నేత, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదంటున్నారు. ఆయన సొంత నియోజక వర్గం రాజాంలో కార్యకర్తలు తమ నాయకుడి కోసం చూస్తున్నారట.

ఇక మరో వైపు చూసుకుంటే సిక్కోలు నుంచి గెలిచిన రెండవ ఎమ్మెల్యే ఇచ్చాపురానికి చెందిన బెందాళం అశోక్ కూడా విశాఖలోనే మకాం వేశారని అంటున్నారు. ఇక మాజీ స్పీకర్ ప్రతిభా భారతితోపాటు, మాజీ మంత్రులు కోండ్రు మురళీమోహనరావు, గుండ అప్పల సూర్యనారాయణ వంటి వారు కూడా అయిపూ అజా లేరని సొంత పార్టీలోనే సణుగుడు వినిపిస్తోంది. మరి కరోనా భయంతోనే వీరంతా సెల్ఫ్ క్వారంటైన్స్ కి వెళ్ళారా లేక వేరే కారణాలా అన్నది అర్ధం కావడం లేదట. ఎక్కడున్నా తన నేతలు హాయిగా, అరోగ్యంగా ఉండాలని కార్యకర్తలు కోరుకోవడ‌మే కొసమెరుపు.

రోజా ఆవకాయ.. చూస్తేనే నోరూరుతుంది