దమ్ముంటే కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించండి

ఏపీ బీజేపీ నేతలు మూడు రాజధానుల విషయంలో రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోందని సుజనా మాట్లాడితే,…

ఏపీ బీజేపీ నేతలు మూడు రాజధానుల విషయంలో రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోందని సుజనా మాట్లాడితే, ఏ రాయి అయితే ఏంటని బీసీజీ నివేదికని మరీ చులకన చేసి మాట్లాడారు కన్నా. వీరిద్దరే కాదు, ఇంకా చాలామంది బీజేపీ నేతలు రాజధాని విషయంలో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు.

అయితే ఇదివరకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చారు. అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, ఇంకా ప్రకటన రాకముందే అత్యుత్సాహం ఎందుకని అన్నారు. మరి ఈ మాటలు రాష్ట్ర బీజేపీ నేతల చెవికెక్కలేదా, కేంద్ర మంత్రే అంత క్లారిటీ ఇచ్చినప్పుడు వీళ్లకి వచ్చిన నొప్పి ఏంటి? జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వీళ్లంతా దమ్ముంటే కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాలి.

అవేమీ చేయకుండా కేవలం ఏపీ సర్కారుపై పడి ఏడవడం ఎందుకు? కేంద్రం చూస్తోంది, మేం అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరించడం దేనికి? మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ పూర్తి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోంది. కేవలం జగన్ సర్కారు నిర్ణయాలను వ్యతిరేకించాలనే ఉద్దేశంతోటే రైతులతో కలసి రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంపై, రాజధానులపై ప్రేమతో కాదు.

నిజంగా బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రజలపై అంత ప్రేమ ఉంటే, రాజధాని అంశంపై ఆందోళన చేసే కంటే ముందు ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసి ఇప్పుడు విషపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి కుటిల రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజోపయోగమైన నిర్ణయాలను సమర్థిస్తేనే ఏపీలో బీజేపీకి మనుగడ. విద్వేష రాజకీయాలను నమ్ముకుంటే.. కేంద్ర ప్రభుత్వ పేరు చెప్పి బతకాల్సిందే కానీ, ఏపీలో సొంత బలం ఎప్పటికీ పెరగదు.

చంద్రబాబూ నీకు ఎవడిచ్చాడు హక్కు