2024 ఎన్నికల్ని పోలీసులు హ్యాండిల్ చేయగలరా?

ప్రస్తుతం కుప్పం పరిస్థితి చూస్తుంటే అసలు 2024 ఎన్నికల్ని పోలీసులు హ్యాండిల్ చేయగలరా అనే అనుమానం వస్తుంది. అడుగడుగునా అవాంతరాలు, డ్యూటీ చేయనీయకుండా డీ-మోరల్ డైలాగులు, అధికార పక్షంతో కుమ్మక్కైపోయారంటూ ఆరోపణలు.  Advertisement ఎగిరెగిరి…

ప్రస్తుతం కుప్పం పరిస్థితి చూస్తుంటే అసలు 2024 ఎన్నికల్ని పోలీసులు హ్యాండిల్ చేయగలరా అనే అనుమానం వస్తుంది. అడుగడుగునా అవాంతరాలు, డ్యూటీ చేయనీయకుండా డీ-మోరల్ డైలాగులు, అధికార పక్షంతో కుమ్మక్కైపోయారంటూ ఆరోపణలు. 

ఎగిరెగిరి పడుతున్న టీడీపీ నేతలు. చిన్న మున్సిపాల్టీ ఎన్నికలకే ఇలా ఉంటే.. ఇక అసెంబ్లీతో పాటు, లోక్ సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగితే.. అప్పుడు ఓటమి బాధతో టీడీపీ పెట్టే హాహాకారాల్ని పోలీసులు తట్టుకోగలరా..?

ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్..

ఓటమి ఎలాగూ తెలిసిపోయింది. ఇక ఓటమికి కారణాలు మాత్రమే వెదుక్కోవాలి. అందుకే మా అభ్యర్థుల్ని తీసుకెళ్లారు, బెదిరించారు, భయపెట్టారు అంటూ.. టీడీపీ భారీ డైలాగులు కొడుతోంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, మున్సిపల్ కమిషనర్ కి చీర-సారె-పసుపు-కుంకుమ పెట్టి ఆయన్ని అవమానించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్. కమిషనర్ కార్యాలయంలో అసలు స్థానికేతర నాయకులకు ఏం పని..? ఎన్నికలంటే చాలు ఎక్కడెక్కడినుంచో వచ్చేసి మకాం పెట్టేస్తారెందుకు..?

తీరా పోలీసులు అదుపులోకి తీసుకోబోయే సమయానికి భోజనం మొదలు పెట్టడం, పడుకున్నట్టు నటించడం.. చివరకు తొక్కేస్తున్నారు, అణగదొక్కేస్తున్నారంటూ సినిమా డైలాగులు. ఏపీలో ప్రస్తుతం పోలీసులకు.. రౌడీలు, గూండాలు, గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడం ఈజీ అవుతోంది కానీ ప్రతిపక్ష టీడీపీని భరించడం మాత్రం బాగా కష్టమైపోతోంది.

బహిరంగ సభల్లో ఎవరో రాయి విసిరారని, తనపై దాడి చేయడానికి బాంబులు, కత్తులు తెచ్చారని అధినేతే స్వయంగా డ్రామాలాడుతుంటే.. ఇక కార్యకర్తలు, చోటామోటా నేతలు ఆగుతారా. అందులోనూ వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో తేల్చుకోవాల్సినవి. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని డ్రామాలు, కుట్రలు బయటపడే అవకాశముందని అంటున్నారు. వీటన్నిటినీ తట్టుకోవడం పోలీసులకు కష్టమైన పనే అనిపిస్తుంది.

ఎన్నికలు లేని సమయంలోనే బోసిడీకే డైలాగులతో రెచ్చగొట్టి, ఫలితం అనుభవించిన టీడీపీ నేతలు.. ఇక ఎన్నికలు దగ్గరికొస్తే ఇంకెన్ని డైలాగులు కొడతారోననే అనుమానం అందరిలోనూ ఉంది. తిట్టడం, తిట్టించుకోవడం.. లేనిపోని సమస్యలు సృష్టించడం, సింపతీ కోసం ట్రై చేయడం.. ఇదీ భవిష్యత్తులో టీడీపీ కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణలో వారు ఫలితం సాధించే క్రమంలో.. అన్యాయంగా ఖాకీలు అవమానాలు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే ఎన్నికల వ్యవహారంలో లెక్కలేనన్ని కేసులు, బెయిళ్లు, ఇతర వ్యవహారాలతో ఖాకీలకు తల బొప్పి కట్టింది. వచ్చే ఎన్నికలనాటికి ఇవి మరింత పెరిగే ప్రమాదముంది.