విజయనగరం రాజుల కోటలో సమరం యమ రేంజిలో సాగుతోంది. పదవులు, రాజకీయాలు, సేవలు అన్నీ కలగలసిపోయిన రంజు అయిన పాలిటిక్స్ ఇపుడు అక్కడ నడుస్తోంది.
ఇక విజయనగరం పూసపాటి వంశాధీశుడు అశోక్ గజపతి రాజు ఇపుడు మాన్సాస్ చైర్మన్ పదవి కోసం అటు కోర్టులోనూ, ఇటు కోర్టు బయటా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఆయనకు పూర్తి మద్దతు ఇస్తూ టీడీపీ మొత్తం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాన్ని రాజకీయం చేసి పారేసింది.
ఈ విషయంలో మొదట్లో ఉత్సాహం చూపిన వైసీపీ ఆ తరువాత మాంత్రం పూర్తి సైలెంట్ అయింది. మాన్సాస్ వ్యవహారం పూర్తిగా ఆ కుటుంబానికి సంబంధించినది అని మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికి అనేక మార్లు చెప్పారు. అలా చెప్పడం వెనక ఉద్దేశ్యం కూడా వేరేది ఏమీ లేదు. తమకు ఆ మచ్చ, మట్టి అంటించుకోరాదనే.
ఈ నేపధ్యంలో అటు పూర్తి రాజకీయ మద్దతుతో అశోక్ గజపతి రాజు ఇపుడు సేవ్ మాన్సాస్ అంటూ వీధి పోరాటాలకు దిగిపోయారు. మరి సంచయిత బీజేపీ నాయకురాలిగానే జనాలకు పరిచయం అయింది. ఆమె 2019 ఎన్నికల వేళ ఢిల్లీ వేదికగా బీజేపీ మెంబర్ షిప్ ని కూడా తీసుకుంది.
అలాంటిది ఆమెకు ఈ సమయంలో మద్దతు ఇవ్వకుండా బీజేపీ చోద్యం చూడడమే రాజకీయ విచిత్రంగా చెప్పుకుంటున్నారు. సంచయిత బీజేపీ నాయకురాలు అవునో కాదో కూడా చెప్పడంలేదు.
మొత్తానికి మాన్సాస్ పోరు రాజకీయ మలుపు తీసుకోవడంతో సంచయిత ఒంటరి పోరాటానికే పరిమితం అయ్యారు. ఆమె ట్వీట్ల ద్వారా బాబాయ్ అశోక్ మీద బాణాలు వేస్తున్నా బీజేపీ సైలెంట్ మాత్రం ఇంటెరెస్ట్ గానే ఉందిపుడు.