పుష్ప కోసం క్రికెటర్లకు డబ్బు ఇస్తున్నారా?

పుష్ప హంగమా దేశవ్యాప్తమైంది. కామన్ ఆడియన్స్ నుంచి క్రికెటర్ల వరకు అంతా పుష్పరాజ్ కు ఫిదా అయ్యారు. చాలామంది సెలబ్రిటీలు శ్రీవల్లి పాటలోని డాన్స్ మూమెంట్ ను వేసి చూపిస్తున్నారు. తగ్గేదేలే అంటూ పుష్ప…

పుష్ప హంగమా దేశవ్యాప్తమైంది. కామన్ ఆడియన్స్ నుంచి క్రికెటర్ల వరకు అంతా పుష్పరాజ్ కు ఫిదా అయ్యారు. చాలామంది సెలబ్రిటీలు శ్రీవల్లి పాటలోని డాన్స్ మూమెంట్ ను వేసి చూపిస్తున్నారు. తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజమ్స్ తో వీడియోలు పెడుతున్నారు. ఓవైపు సోషల్ మీడియాలో ఇంత హంగామా జరుగుతుంటే, మరోవైపు ఈ హంగామా అంతా పెయిడ్ అంటూ మరో ప్రచారం ఊపందుకుంది.

పుష్ప సినిమా థియేటర్లలో కొనసాగుతున్నంతసేపు దానికి సోషల్ మీడియాలో అంత క్రేజ్ రాలేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే దాన్ని భుజానికెత్తుకున్నారు. ఎప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో సినిమా స్ట్రీమింగ్ కు వచ్చిందో, ఇక అక్కడ్నుంచి క్రికెటర్లు ఈ మూవీని ఫాలో అయ్యారు. రకరకాల మేనరిజమ్స్ ను ఇనస్టాలో పెట్టడం స్టార్ట్ చేశారు. దీని వెనక అమెజాన్ హస్తం ఉందని కొందరు ఆరోపించారు.

క్రికెటర్లకు డబ్బులిచ్చి, అమెజాన్ సంస్థ పుష్ప ప్రచారాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లిందంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.

పుష్ప సినిమాను ప్రచారం చేయాల్సిన అవసరం అమెజాన్ కు లేదు. ఓటీటీలో అతిపెద్ద శక్తిగా అవతరించిన అమెజాన్, వేల కోట్ల రూపాయలతో తీసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిగి ఉంది. ఇలాంటి సంస్థ కేవలం పుష్ప సినిమాపై దృష్టి పెట్టిందని అనుకోవడం భ్రమ అవుతుంది.

ఓటీటీలో రిలీజైన తర్వాతే సోషల్ మీడియాలో పుష్పకు మరింత ఆదరణ పెరగడానికి ఇంకో కారణం కూడా ఉంది. కరోనా కారణంగా చాలామంది సినిమాను థియేటర్లకు వెళ్లి చూడలేదు. అలాంటి వాళ్లంతా ఓటీటీలో రిలీజైన తర్వాత పుష్ప సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు. కాబట్టి పుష్ప కోసం ప్రత్యేకంగా అమెజాన్ పెయిడ్ క్యాంపెయిన్ జరుగుతోందనడంలో ఎలాంటి వాస్తవం లేదు.

రవీంద్ర జడేజా, సురేష్ రైనా, బ్రేవో, వార్నర్ లాంటి ఎంతోమంది ప్రముఖులు పుష్ప మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇక పాక్-బంగ్లా ప్రీమియర్ లీగ్ లో, పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పుష్ప మీమ్స్ ను క్రీడాకారులు ప్రదర్శించారు. ఇదంతా కేవలం పుష్ప మేనియా మాత్రమే.

తాజాగా ఈ సినిమా నార్త్ లో వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. బాహుబలి, సాహో తర్వాత వంద కోట్ల మార్క్ అందుకున్న సౌత్ మూవీగా పుష్ప సినిమా రికార్డ్ సృష్టించింది.