పక్కా రాజకీయం ఇది. ఇక్కడ జరగదు అని ఏదీ లేదు. అయితే వైసీపీ నాయకులు కొందరు టీడీపీ జాతకాన్ని కూడా చెబుతూ జరగబోయేది ఇదే అంటూంటే తమ్ముళ్ళు తెగ ఫీల్ అవుతున్నారుట.
ఏపీలో టీడీపీ పని అయిపోయిందని, అందువల్ల ఆ పార్టీని నమ్ముకుంటే మునగడం ఖాయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం అంటున్నారు.
ఏపీలో ఉద్యోగాలు ఇచ్చిందే వైసీపీ అని, అలాగే లక్షల్లో ఇల్లు కట్టిస్తోందని ఆయన బల్ల గుద్ది చెబుతున్నారు. అలాంటిది రాజకీయ కక్షతో వైసీపీ మీద విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు ఆత్మానందం పొందుతున్నారని రొంగలి హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలో తాజా పరిణామాలను ను దృష్టిలో ఉంచుకుని ఆయన చెప్పారో ఏమో కానీ త్వరలోనే టీడీపీని కాంగ్రెస్ లో కలిపేయడం ఖాయమని చంద్రబాబు మీద సెటైర్లు వేశారు.
అవును ఎటూ మాజీ తమ్ముడే తెలంగాణా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి జరిగినా జరగవచ్చు అని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీకి కి వరస ఓటముల కంటే కూడా ఈ బాంబు లాంటి వార్త తెగ పరేషన్ చేస్తోందిట.