ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ ఇది!

బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం. మహా అయితే ఒక బిర్యానీకి 200 రూపాయలు ఖర్చుపెడతారు. ఇంకాస్త వెరైటీ కోరుకుంటే 500 రూపాయల వరకు బిర్యానీ రకాలున్నాయి. కానీ ఒక ప్లేట్ బిర్యానీకి ఎవరైనా 20వేల…

బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం. మహా అయితే ఒక బిర్యానీకి 200 రూపాయలు ఖర్చుపెడతారు. ఇంకాస్త వెరైటీ కోరుకుంటే 500 రూపాయల వరకు బిర్యానీ రకాలున్నాయి. కానీ ఒక ప్లేట్ బిర్యానీకి ఎవరైనా 20వేల రూపాయలు ఖర్చుపెడతారు. అలాంటి ఖరీదైన బిర్యానీ ఇప్పుడు రెడీ అయింది.

దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్ లో ఈ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. దీని ఖరీదు అక్షరాలా 20వేల రూపాయలు. బ్రిటిష్ కాలంనాటి ఇంటీరియర్ తో ఉన్న ఈ లగ్జరీ హోటల్ లో తయారుచేసిన ఈ బిర్యానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇంతకీ ఈ బిర్యానీలో ఏం పెడతారు?

3 కేజీల ఈ రాయల్ గోల్డ్ బిర్యానీని తయారుచేయడానికి 45 నిమిషాల టైమ్ పడుతుంది. ఇందులో 3 రకాల రైస్ వడ్డిస్తారు. చికెన్ బిర్యానీ రైస్, కీమా రైస్, కుంకుమపువ్వు రైస్ ను వడ్డిస్తారు. వీటిపై చిన్న బంగాలాదుంపలు, ఉడికించిన కోడిగుడ్లు పెడతారు. ఈ బిర్యానీలో మలాయ్ చికెన్, రాజ్ పుతానా ముర్గ్, చికెన్ మీట్ బాల్స్ ఉంటాయి.

వీటికి అదనంగా మటన్ చాప్స్, మటన్ కబాబ్స్ ను ఉంచుతారు. ఇక వేయించిన జీడిపప్పు, దానిమ్మ గింజలు, వేయించిన ఉల్లిపాయలు టాపప్ గా ఉంచారు. ఇక సైడ్ డిష్ విషయానికొస్తే.. నిహారి సలాన్, జోధ్ పూరి సలాన్, బాదామీ సాస్, బాదం, దానిమ్మ రైతాను అందిస్తారు.

అయితే ఇవన్నీ రొటీనే కదా, దీనికి 20వేల రూపాయలు ఎందుకు? ఈ ప్లేట్ మొత్తాన్ని 23 క్యారెట్ల బంగారు పేపర్ తో గార్నిష్ చేస్తారు. ఈ బంగారం పేపర్ ను బిర్యానీతో పాటు ఆరగించవచ్చు. అందుకే ఈ ప్లేట్ ప్రపంచంలోనే కాస్ట్ లీ బిర్యానీగా పేరు తెచ్చుకుంది. 

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

టీడీపీ ముచ్చట తీరింది