ఐదేళ్లు ఏం చేశారు యనమలా!

ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించకపోయినా యనమల రామకృష్ణుడుకు చంద్రబాబు నాయుడు  చాలా ప్రాధాన్యతనే ఇచ్చారు. అలా చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యతకు తగ్గట్టుగా గాలి మాటలను గట్టిగానే మాట్లాడుతున్నారు యనమల రామకృష్ణుడు. పంటి వైద్యం కోసం ప్రభుత్వ…

ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించకపోయినా యనమల రామకృష్ణుడుకు చంద్రబాబు నాయుడు  చాలా ప్రాధాన్యతనే ఇచ్చారు. అలా చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యతకు తగ్గట్టుగా గాలి మాటలను గట్టిగానే మాట్లాడుతున్నారు యనమల రామకృష్ణుడు. పంటి వైద్యం కోసం ప్రభుత్వ సొమ్ముతో సింగపూర్ వరకూ వెళ్లి వచ్చిన యనమల ఇప్పుడు  రైతుల కష్టాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.

మన దగ్గర ఐదారు వేల రూపాయల ఖర్చుకు చేసే వైద్యం కోసం సింగపూర్ వరకూ వెళ్లి, ప్రజల సొమ్మును లక్షల కొద్దీ నాకేసిన యనమల రైతుల గురించి మాట్లాడమే పెద్ద కామెడీ. రైతులు, ప్రజల గురించి ఇంత 
బాధ్యత ఉన్న పెద్దమనిషా.. సింగపూర్ వరకూ వెళ్లి ప్రజల సొమ్ముతో పంటిని పీకించుకు  వచ్చినది అని ఆశ్చర్యపోకండి!

అలాగే చంద్రబాబు జమానాలో అపారమైన ఆర్థిక వేత్త అయిన యనమల రామకృష్ణుడు ఇప్పుడు  రుణమాఫీ గురించి  మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు నాలుగు, ఐదో విడత మాఫీ చేయాలని.. జగన్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలని ఈయన డిమాండ్ చేసేస్తూ ఉన్నారు.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక సార్లు ఈ మాట మాట్లాడి నవ్వులపాలయ్యారు. ఐదేళ్ల అధికారం ప్రజలు చంద్రబాబుకు ఇచ్చారు. అధికారం ఇస్తే చాలు  రుణమాఫీ అని చెప్పిన  చంద్రబాబు, ఐదు విడతల్లో మాఫీ అని అన్నారు. ఐదేళ్లు, ఐదు విడతలు అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం  ఏమీ మధ్యలో పడిపోలేదు.  ఐదేళ్లూ అధికారాన్ని వెలగబెట్టింది. అయితే..రుణమాఫీని మాత్రం మూడు సార్లే చేశారట. ఆ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు. అప్పుడేమో రుణమాఫీ మొత్తం చేసినట్టుగా చెప్పుకున్నారు. ఇప్పుడేమో..రెండు విడతల మాఫీ పెండింగ్ అని.. అది జగన్ ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.

తమ చేతగాని తనాన్ని, తమ అబద్ధాలను, తమ అర్థం లేని తనాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇలా ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు. రుణమాఫీ సాధ్యం కాదని మొదటే చెప్పిన జగన్ ఎద్దేవా చేసి, నానామాటలు అని, అధికారాన్ని పొంది, ఇప్పుడు మళ్లీ రుణమాఫీ చేయాలంటూ జగన్ ను డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ సిగ్గుమాలిన తనాన్ని చూసి రైతులు కూడా నవ్వుకుంటున్నారు.

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు