తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అధికారం కోసం రెండు జాతీయ, ఒక అధికార పార్టీ ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ , అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇటీవల బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడంతో బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణ బాట పట్టారు. బెయిల్‌పై విడుదలైన బండి సంజయ్‌ను ఆ పార్టీ జాతీయ నేతలంతా తెలంగాణకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైళ్లో పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక బండి సంజయ్ నోటికి హద్దే లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వేయాలని, అప్పుడే ప్రజలు ఉరికించి కొడతారని ఘాటు హెచ్చరికలు చేశారు.
అరెస్ట్ చేయిస్తామని ఒకడు.. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్ అయ్యారు. రైతుల మీద కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందన్నారు. ఎరువుల విషయంలో బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఏవేవో ప్రగల్భాలు పలికాడని వెటకరించారు. కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకంగా చేసినప్పుడు రేవంతే విమర్శలు చేశాడని ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణ ఎడారి కావటానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు.