కుల సంఘాలు అవసరమేనన్న వైసీపీ ఎమ్మెల్యే

కులాలు లేని సమాజాన్ని ఎవరూ వర్తమానంలో ఊహించలేరు. ఆ మాటకు వస్తే ఇతర జంతు జాలాల్లో కూడా వాటి రంగులు తెగల బట్టి కూడా విభజన ఉంటోంది.  Advertisement అల్టిమేట్ గా అంతా ఒక్కటి…

కులాలు లేని సమాజాన్ని ఎవరూ వర్తమానంలో ఊహించలేరు. ఆ మాటకు వస్తే ఇతర జంతు జాలాల్లో కూడా వాటి రంగులు తెగల బట్టి కూడా విభజన ఉంటోంది. 

అల్టిమేట్ గా అంతా ఒక్కటి అన్న భావనకు రావడం మంచిది కానీ కులాలు ఉండకూడదు అన్నది ఇప్పటికైతే ఊహాజనితమైనదే. పైగా పేరాశగా కూడా చెప్పాలేమో.

ఇదిలా ఉంటే కుల సంఘాలు ఉండడం సమాజ మనుగడకు అభివృద్ధికి మేలు చేసేదేనని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజం  అంటేనే కులాల సమూహమని ఆయన అన్నారు.

కుల సంఘాలు తమ పరిధిలో సొంత కులస్థులకు మేలు చేయడానికి పాటుపడితే అది సమాజ ప్రగతికి కూడా పరోక్షంగా దోహదపడుతుంది అని ధర్మాన పేర్కొనడం విశేషం. 

మొత్తానికి కులాలు వద్దు అవి అసలు అంటూ లేవు అంటూ ప్రగతి శీల మాటలు చెబుతున్న వారే కులాల తోకలను పట్టుకుని రాజకీయాలు చేయడం చూస్తున్న ప్రస్తుత కాలంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే కాదు, కులాల ఆవశ్యకత. వాటిని మంచి వైపుగా నడిపించాలన్న ఆలోచనతో కూడిన ధర్మాన సందేశం నిజంగా మెచ్చతగినదే.

ఇళ్ల పట్టాలు నిరంతర ప్రక్రియ

'వకీల్‌ సాబ్‌ కాదు.. నువ్వు షకీలా సాబ్‌'

అరియానా నేను మంచి ఫ్రెండ్స్..  పెళ్లి చేసుకోను