వైసీపీ సీక్రెట్ మీటింగ్….టార్గెట్ వారే ?

సరిగ్గా వారం క్రితం తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రా రక్షణ పేరిట విశాఖలో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశం అజెండా ఎలా ఉన్నా కూడా అధికార వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా చేసుకున్నారు. అందరు…

సరిగ్గా వారం క్రితం తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రా రక్షణ పేరిట విశాఖలో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశం అజెండా ఎలా ఉన్నా కూడా అధికార వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా చేసుకున్నారు. అందరు నాయకులూ కూడా వైసీపీనే నిందించారు. ఉత్తరాంధ్రా పేరు మీద మరో సారి అలా తమ్ముళ్ళు రాజకీయ విమర్శల దాడి చేశారనే చెప్పుకున్నారు.

ఇక ఇపుడు అధికార వైసీపీ వంతు. ఆ పార్టీ తాజాగా బీచ్ రోడ్డులోని ఒక రిసార్ట్స్ మీటింగ్ నిర్వహించింది. ఇది పూర్తిగా ఇన్ కెమెరా మీటింగ్ గానే సాగింది. కేవలం ఆ పార్టీని చెందిన మంత్రి, కార్పోరేటర్లు, వార్డు ఇంచార్జులు, ఎమ్మెల్యేలు, నాయకులు అంతా హాజరైన ఈ మీటింగ్ కి ఎంపీ విజయసాయిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ సారాశం ఏంటి అన్నది బయటకు నేతలు చెప్పకపోయినా టార్గెట్ టీడీపీగానే సాగింది అంటున్నారు.  

లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా జనం వైసీపీకి జై కొట్టారు. దాంతో ఇక విశాఖలో రాజకీయ పరిస్థితిని ఎదురులేకుండా చేసుకోవడానికి మరింత దూకుడు ప్రదర్శించాలని కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది. మరో వైపు చూస్తే విశాఖలో కొందరు అధికారులు ఈ రోజుకూ విపక్ష తెలుగుదేశానికి సహాయంగా ఉంటున్నారు అన్నది కూడా నేతల నుంచి ఆరోపణ. 

అటువంటి వారిని పక్కన పెడితేనే విశాఖలో పాలన సజావుగా సాగుతుందని తీర్మానించారుట. ఈ లిస్ట్ లో ఒక ఉన్నతాధికారిణి కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీలో మిగిలిన తమ్ముళ్ళను కూడా తమ వైపునకు తిప్పుకోవాలని వైసీపీ కొత్త వ్యూహానికి పదును పెడుతోందిట.