తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ కు అమరావతి ప్రాంత యువతి ఒకరు తీవ్ర హెచ్చరిక చేశారు. తన తండ్రి మరణాన్ని రాజకీయం చేస్తున్నాడంటూ లోకేష్ పై ఆమె మండిపడ్డారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఎవరు చనిపోయినా.. వారు రాజధాని కోసమే చనిపోతున్నారంటూ లెక్క గడుతున్న లోకేష్ కు ఈ హెచ్చరికతో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. శవ రాజకీయాల్లో తండ్రిని మించిపోతున్న లోకేష్ కు ఒక యువతి చెప్పుతో సత్కరిస్తానంటూ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ''వైకాపా నేతల అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు బలైపోయారు.రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా @ysjagan గారి మనస్సు కరగడం లేదు.జై అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం.'' అంటూ ట్వీట్ చేస్తూ ఆ ప్రాంతంలో ఇటీవలే మరణించిన రైతుల ఫొటోలను లోకేష్ పోస్టు చేశారు. ఈ పోస్టుపై సదరు రైతుల్లో ఒక రైతు కూతురు స్పందించింది.
ఆమె స్పందన ఇలా ఉంది..
''మా నాన్న గారి గురించి ఎవడు చెప్పాడు నీకు చెప్పు తీసుకుని కొడతా రాస్కెల్ ని … వాడికి తెలుసా భూముల కోసం గుండె ఆగింది అని… వెధవ జనసేన లో భజన చేసి దిక్కులేక ఇప్పుడు పచ్చ జండా పట్టి చావులను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటానికి బుద్దిలేదా వాడికి లేదు విద్యావేత్తవేగా నీకు తెలియదా…''
''మా నాన్న గారు చనిపోయి పుట్టెడు దుక్ఖంలో ఉన్నాము ఆయన మరణాన్ని మీ నీచ రాజకీయాల కోసం వాడుకుని పబ్బం గడుపుకో వద్దు… చేతనైతే నాలుగు ఆదరణ మాటలు చెప్పండి లేకుంటే మౌనంగా ఉండండి అంతే గాని రాజధాని కోసం గుండె ఆగిందంటూ… దాని కోసం దీని కోసం అంటూ పిట్ట కథలు అల్లోద్దు.''
అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇదీ చంద్రబాబు తనయుడి శవరాజకీయం తీరు. తమ అనుకూల మీడియా మాత్రమే ఉందనే భ్రమలోంచి నారా ఫ్యామిలీ ఇంకా బయటకు రానట్టుగా ఉంది. తప్పుడు ప్రచారాలకు ఇట్టే చెక్ పెడతారు అనే విషయాన్ని టీడీపీ గ్రహించడం లేదు.
పక్క రాష్ట్రాలలో జరిగిన వాటి ఫొటోలను ఉపయోగించుకుంటూ, గ్రాఫిక్స్ తో గతంలో అనుకూల ప్రచారాలు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికీ అదే తప్పుడు ప్రచారాలు, ఫొటోలనే నమ్ముకుంటున్నట్టుగా ఉన్నారు. ఇవి కూడా బెడిసికొడుతున్నాయి.