ఇండియాటుడే చేపట్టిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మెరుగైన స్థానం దక్కింది. దేశంలో రాష్ట్రాల వారీగా అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంలలో జగన్ కు మూడో స్థానం దక్కింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలిచిన ఈ జాబితాలో జగన్ కు మూడో స్థానం దక్కింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది.
తొలిస్థానంలో నిలిచిన యోగి ఆదిత్యనాథ్ 24 శాతం ఓట్లు పొందగా, ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ 15 శాతం ప్రజాదరణ పొందారు. 19 రాష్ట్రాల సీఎంల జాబితాతో ఈ సర్వే చేపట్టినట్టుగా ఉన్నారు. వందశాతంలో ఒక్కో సీఎంకు వచ్చిన మార్కుల శాతం లాంటిది ఈ పర్సెంటేజ్. జగన్ వాటా 11 శాతంగా నిలిచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు శాతంతో తొమ్మిదో స్థానంలో నిలిచారు.