పోయినోళ్ళందరూ మంచివాళ్ళు అన్నాడు ఆచార్య ఆత్రేయ. ఆది తాత్విక భావన. అసలైన వేదాంతమది. నిరంతరం రాద్దాంతం చేసేవారికి అది అబ్బుతుందని ఎవరూ అనుకోరు. హఠాత్తుగా వైఎస్సార్‌ని పొగుడుతున్నారంటనే అందులో అర్ధం పరమార్ధం ఉంటాయి
చంద్రబాబు దగ్గర నుంచి తమ్ముళ్లందరికీ ఇపుడు వైఎస్సార్ దేవుడు. జగనే దెయ్యం. ఎందుకంటే అధికారం లాక్కుని సీఎం కుర్చీలో దర్జాగా వెలిగిపోతున్నాడు కాబట్టి. ఇదేరకమైన భావనను ఇపుడు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ పాలన స్వర్ణయుగం అంటున్నారు. నాడు కులమతాలు తేడా లేకుండా అందరికీ పధకాలు ఇచ్చాడని, జగన్ మాత్రం అలా చేయడంలేదని, పాలన కూడా బాగోలేదని శత్రుచర్ల టీడీపీ శత్రు శిబిరం నుంచి పెద్ద గొంతుకతో మాట్లాడుతున్నారు.
పార్టీలు చూసి పధకాలు పంపిణీ చేస్తున్నారుట. ఇది మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లాగానే చేసిన ఆరోపణ. మరి అచ్చెన్నాయుడుకు అసలైన సవాల్ వైసీపీ నేతలు చేస్తే ఆయన సైలెంట్ అయిపోయారు. అయినా కూడా ఇపుడు తన వంతు అనుకుంటూ శత్రుచర్ల ముందుకురావడమే విడ్డూరం.
ఇక కోడలు, ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మీద కూడా మామ శత్రుచర్ల హాట్ కామెంట్స్ చేశారు. కోడలు పాలనలో కురుపాం నియోజకవర్గం అభివ్రుధ్ధి ఊసు లేకుండా ఉందట. ఏడాదిలో ఏమీ చేయలేదుట.
నిజంగా చేసినా పచ్చ పార్టీ వారికి కనిపిస్తాయా. చేసింది ఒప్పుకోవడానికి మంచి మనసు ఉంటుందా అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి కోడలు గెలుపు దెబ్బకు ఏడాది పాటు కనిపించకుండా పోయిన శత్రుచర్ల వంటి వారు ఇపుడు మళ్ళీ పెద్ద గొంతేసుకుంటున్నారంటే తామింకా రాజకీయాల్లో ఉన్నట్లుగా ఉనికిపాట్లు పడేందుకేనని వైసీపీ నాయకులు అంటున్నారు.