టీడీపీ కంచుకోటలో వైఎస్సార్ విగ్రహం

వైఎస్సార్ బతికినన్నాళ్ళు ప్రజా బంధువుగా నిలిచారు. ఆయన దుర్మరణం పాలు అయ్యాక తెలుగు  ప్రజలకు  నిజమైన దేవుడు అయిపోయారు. వైఎస్సార్ జయంతి, వర్ధంతుల వేళ ఆ మహానుభావున్ని తలచుకోవడం, నివాళులు ఘనంగా అర్పించడం తెలుగు…

వైఎస్సార్ బతికినన్నాళ్ళు ప్రజా బంధువుగా నిలిచారు. ఆయన దుర్మరణం పాలు అయ్యాక తెలుగు  ప్రజలకు  నిజమైన దేవుడు అయిపోయారు. వైఎస్సార్ జయంతి, వర్ధంతుల వేళ ఆ మహానుభావున్ని తలచుకోవడం, నివాళులు ఘనంగా అర్పించడం తెలుగు ప్రజలకు అతి ముఖ్య కర్తవ్యంగా మారింది.

ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ పుట్టాక ఉత్తరాంధ్రాలోని అనేక నియోజకవర్గాలు ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయాయి. అటువంటి వాటిలో శ్రీకాకుళం జిల్లాలోని అముదాలవలస ఒకటి. ఇక్కడ నుంచి అనేక సార్లు తమ్మినేని సీతారాం జెండా ఎగురవేశారు. ఆయన టీడీపీని వీడిన తరువాత మేనల్లుడు కూన రవికుమార్ ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా పాతారు.

అటువంటి చోట 2019 ఎన్నికల్లో మళ్ళీ తమ్మినేని విజయం సాధించారు. ఆయనకు ఆ  విజయం దాదాపు రెండు దశాబ్దాల తరువాత దక్కింది. ఇక ఇక్కడ ఎన్టీయార్ విగ్రహాలు ఎటు చూసినా కనిపిస్తాయి కానీ ఇపుడు తమ్మినేని చొరవతో ఏకంగా పది అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

వైఎస్సార్ జయంతి వేళ ఈ విగ్రహాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభిస్తారు. ఈ విగ్రహాన్ని గుంటూరు కి చెందిన శిల్పులు తీర్చిదిద్దారు.  మొత్తం 450 కిలోల‌ కంచును ఈ విగ్రహానికి  ఉపయోగించారు. ఈ విగ్రహం చూస్తే అచ్చం రాజశేఖరరెడ్డి కళ్ల ముందు కనిపిస్తారు. అంత ఆకర్షణీయంగా జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఈ విగ్రహం ఇకపై ఆముదాలవలస ప్రజలను నిత్యం పలకరించనుంది.

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్

తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు?