సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ రేపిన కులకలంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచితంగా మాట్లాడటం, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కులవృత్తి పేరుతో దూషించడంపై ఫిర్యాదులు నమోదు అవుతూ ఉన్నాయి.
ఇందులో భాగంగా… తప్పుడు కథనాలు, సన్నివేశాలతో తప్పుడు సమాచారం ఇస్తున్న పెయిడ్ ఆర్టిస్టుల వెనుక ఎవరున్నారో తేల్చాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కోరారు ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి. టీడీపీకి చెందిన కొందరు జూనియర్ పెయిడ్ ఆర్టిస్ట్ ల విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ను దేవేంద్ర రెడ్డి కలిశారు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి అసభ్యంగా మాట్లాడుతూ.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కులాన్ని దూషించిన కుడితిపూడి శేఖర్ చౌదరి చేసిన వీడియోపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఏపీ డీజీపీ స్పందించారు. మూడు రోజుల్లో పెయిడ్ ఆర్టిస్టును అరెస్ట్ చేసి దీనికి వెనుక ఎవరున్నారో వివరాలన్నీ బయటకు తీస్తామని డీజీపీ అన్నారు.