Advertisement

Advertisement


Home > Sports - Cricket

ఎంఎస్‌ ధోనీ.. అంతకు మించి.!

ఎంఎస్‌ ధోనీ.. అంతకు మించి.!

భారత క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ స్థాయిలో 'స్టార్‌ డమ్‌' సంపాదించుకున్న క్రికెటర్లలో మహేంద్రసింగ్‌ ధోనీ పేరు ముందుంటుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. వికెట్‌ కీపర్‌గా జట్టులోకి వచ్చి, బ్యాట్స్‌మెన్‌గా సత్తా చాటి, కెప్టెన్‌గా ఎదిగి, మూడు ఫార్మాట్లలో టీమిండియాకి అద్భుతమైన విజయాల్ని అందించాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌. 

ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా టీమిండియాని గట్టున పడేయగల సత్తా వున్న బ్యాట్స్‌మెన్‌గానే కాదు, వికెట్ల వెనకాల 'కీపింగ్‌' చేస్తూనే, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ, అప్పుడప్పుడూ రిస్కీ డెసిషన్స్‌ తీసుకుంటూ, టీమిండియాకి అనూహ్య విజయాల్ని ఎంఎస్‌ ధోనీ అందించిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సచిన్‌ రికార్డుల్ని కొల్లగొట్టేస్తూ, దూకుడుకి కేరాఫ్‌ అడ్రస్‌ అన్పించుకున్న విరాట్‌ కోహ్లీ, టీమిండియాకి కెప్టెన్‌ అయినాగానీ, 'మా రియల్‌ కెప్టెన్‌ ధోనీ' అని కోహ్లీనే ధోనీ మీద అమితమైన అభిమానాన్ని చాటుకుంటుంటాడు. అదీ ధోనీకి వున్న ఫాలోయింగ్‌. 

అయితే, ఏ క్రికెటర్‌కి అయినాసరే, వయసు రిటైర్‌మెంట్‌ వైపు నడిపిస్తుంటుంది. గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, గంగూలీ, ద్రావిడ్‌, లక్ష్మణ్‌, సచిన్‌ టెండూల్కర్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే, భారత క్రికెట్‌లో ఎందరో మహానుభావులు.! రిటైర్‌మెంట్‌ ఫేజ్‌లో చాలామందికి చాలా చాలా అవమానాలు ఎదరయ్యాయి. రెండు మూడు ఫెయిల్యూర్స్‌ వస్తే చాలు, 'ఇక ఆట ముగిసింది రిటైర్‌మెంట్‌ ప్రకటించేస్తే మంచిది..' అని మాజీ క్రికెటర్ల సెటైర్లు షురూ అవుతాయి. పైన చెప్పుకున్నవారంతా వీటిని ఎదుర్కొన్నవారే, ఆ తర్వాత వాళ్ళలోనూ కొందరు ఇతరులపై సెటైర్లు వేసినారే.! 

ఇప్పుడు ధోనీ, రిటైర్‌మెంట్‌కి సంబంధించి సెటైర్లు ఎదుర్కొంటున్నాడు. ఈసారి సీనియర్లు మాత్రం, ధోనీకి అండగా నిలబడుతున్నారు. అదే మరి, ధోనీ ప్రత్యేకత.! కపిల్‌నే తీసుకుంటే, సచిన్‌పైనా విమర్శలు చేసిన ఘనుడు. ఇప్పుడు ఆ కపిల్‌, ధోనీని వెనకేసుకొస్తున్నాడు. చిత్రమైన సందర్భమే ఇది. రవిశాస్త్రి కూడా అంతే. విమర్శలు కాదు, వెటకారాలు చేయడంలో రవిశాస్త్రి దిట్ట. ఆ రవిశాస్త్రి, ఇప్పుడు ధోనీ మెప్పు కోసం పాకులాడుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

ధోనీ కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ అనేది ఆయా ఆటగాళ్ళకు ఓ 'గౌరవం'లా వుండాలి, అవమానకరంగా వుండకూడదు. ధోనీ పైనా ఒకప్పుడు విమర్శలు వచ్చాయి. ఆ బ్యాచ్‌లో రవిశాస్త్రి, కపిల్‌ దేవ్‌ కూడా వున్నారు. ఇప్పుడు సీన్‌ మారింది. ఎందుకీ మార్పు.? ఇదేమీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న కాదు, ఇది జస్ట్‌ క్రికెట్‌ రాజకీయం అంతే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?