Advertisement

Advertisement


Home > Sports - Cricket

ప్రపంచ కప్‌.. ఆస్ట్రేలియాదే

ప్రపంచ కప్‌.. ఆస్ట్రేలియాదే

తొలిసారి ప్రపంచ కప్‌ను అందుకోవాలన్న కివీస్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఆస్ట్రేలియా వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ని ఆస్ట్రేలియా అందుకుంది. దీంతో ఐదోసారి వన్డే క్రికెట్‌ విశ్వ విజేత టైటిల్‌ని ఆస్ట్రేలియా అందుకున్నట్లయ్యింది.

సెమీస్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలవడంతో కొందరు భారత క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ని టీమిండియా చేజార్చుకుందన్నది వారి వాదన. అయితే, ఆస్ట్రేలియా ఎంత బలంగా వుందో, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రుజువయ్యింది. ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా సెమీస్‌కి ముందుదాకా ఒక్క మ్యాచ్‌నీ కోల్పోలేదు. న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.

ఆస్ట్రేలియా అలా కాదు, జాగ్రత్తగా కప్‌ని చేజిక్కించుకోడానికి వ్యూహాలు రచించుకుంటూ వెళ్ళింది. ఈ టోర్నీలో ఓ సారి న్యూజిలాండ్‌ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది కూడా. కానీ, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ని మట్టి కరిపించింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా టార్గెట్‌ 200 పరుగుల లోపే వుండడం గమనార్హం. సెమీస్‌లో సౌతాఫ్రికాని గడగడలాడించిన న్యూజిలాండ్‌ కేవలం 183 పరుగులకే ఫైనల్‌లో ఆలౌటయ్యింది. 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌, తక్కువ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేసింది. క్లార్క్‌, స్మిత్‌ అర్థ సెంచరీలతో ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించారు.

ఇదిలా వుంటే, ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో తమ జట్టు పరాజయం పాలవడంతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తొలిసారి వరల్డ్‌ కప్‌ అందుకుంటామన్న వారి ఆశలు అడియాసలవడంతో, తమ క్రికెటర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు కొందరు అభిమానులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?