ఫ్లాప్ దర్శకుడిపై కల్యాణ్ రామ్ నమ్మకానికి కారణం?

హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్. అయితే కొన్ని సినిమాలకు సీక్వెల్స్ బదులు ప్రీక్వెల్స్ వస్తుంటాయి, కాంతార అలాంటిదే. ఇప్పుడీ కోవలోకి బింబిసార కూడా చేరింది. Advertisement బ్లాక్ బస్టర్ బింబిసారకు ప్రీక్వెల్ రాబోతోంది.…

హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్. అయితే కొన్ని సినిమాలకు సీక్వెల్స్ బదులు ప్రీక్వెల్స్ వస్తుంటాయి, కాంతార అలాంటిదే. ఇప్పుడీ కోవలోకి బింబిసార కూడా చేరింది.

బ్లాక్ బస్టర్ బింబిసారకు ప్రీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టుకు వశిష్ఠ దర్శకుడు కాదు. విశ్వంభర సినిమాతో వశిష్ఠ బిజీగా ఉండడంతో, ప్రీక్వెల్ బాధ్యతల్ని అనీల్ పాదూరికి అప్పగించారు.

గతంలో రొమాంటిక్ (ఆకాష్ పూరి) అనే సినిమా తీశాడు అనీల్ పాదూరి. బింబిసార ప్రీక్వెల్ అవకాశం రావడానికి కారణం కల్యాణ్ రామ్, అనీల్ మధ్య ఉన్న అనుబంధమే. కొన్నేళ్లుగా వీళ్లు కలిసి పనిచేస్తున్నారు. స్వతహాగా విజువల్ ఎపెక్ట్స్ స్పెషలిస్ట్ అయిన అనీల్ పాదూరి.. జై లవకుశ, టెంపర్, పటాస్ లాంటి ఎన్నో సినిమాలకు విజువల్ ఎఫెక్టు విభాగంలో పనిచేశాడు. దీంతో పాటు స్టోరీ డిస్కషన్స్ లో కూడా కూర్చున్నాడు.

అతడి పనితీరు నచ్చడంతో పాటు.. బింబిసార ప్రీక్వెల్ కు భారీ గ్రాఫిక్స్ అవసరం పడ్డంతో.. మొత్తంగా సినిమా బాధ్యతను అనీల్ పాదూరి చేతిలో పెట్టాడు కల్యాణ్ రామ్. దర్శకుడిగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అనీల్ కు ఇది చాలా పెద్ద అవకాశం.

త్రిగర్తల రాజ్యాన్ని పరిపాలించిన బింబిసారుడి కంటే ముందు లెజెండ్ గా పేరుతెచ్చుకున్న ఓ ధర్మప్రభువు కథతో ఈ సినిమా రాబోతోంది. బింబిసార ప్రయాణం మొదలవ్వడానికి మూలం, కారణాలతో ఈ సినిమా నడుస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.