కిరణ్ అబ్బవరం పెళ్లి కబురు మోసుకొచ్చాడు. తన ప్రేయసి రహస్యను వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. వీళ్లిద్దరికీ కొన్ని నెలల కిందట ఘనంగా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రహస్య, తన కాబోయే భర్త కిరణ్ అబ్బవరం సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటోంది. తాజా చిత్రం “క”లో రహస్య పాత్ర చాలా ఉందంటున్నాడు అబ్బవరం.
“తను ఎప్పుడూ నా లక్. రాజావారు రాణిగారు సినిమా నుంచి నాకు సపోర్ట్ చేస్తోంది. ఒకట్రెండు సినిమాలు ఇబ్బంది పెట్టిన తర్వాత, ఇప్పుడు నా కంటే ఎక్కువగా తనే కథలు వింటోంది. టీం అందరం కూర్చొని డిసైడ్ అయి ముందుకెళ్తున్నాం. ‘క’ అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువుంది. దగ్గరుండి అన్నీ చూసుకుంది.”
మరి పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా? కచ్చితంగా ఉందంటున్నాడు కిరణ్. తనతో మరో సినిమా చేస్తానని రహస్యకు మాటిచ్చాడట. కాబట్టి మంచి కథ సెట్ అయితే రహస్యతో కచ్చితంగా మరో సినిమా చేస్తానంటున్నాడు.
“క” సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్న కిరణ్ అబ్బవరం, తన స్థాయి చిన్నదా, పెద్దదా అనేది అప్రస్తుతమని.. తన సినిమాలో కంటెంట్ కు ఆ స్థాయి ఉందా లేదా అనేది ముఖ్యమని అంటున్నాడు. ‘క’ సినిమాలో పాన్ ఇండియా కంటెంట్ ఉందని, అందుకే మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు.