మైథలాజికల్ టచ్.. కొత్త మ్యాజిక్

కార్తికేయ 2.. సినిమా ఓ మాదిరే కానీ.. అనుపమఖేర్ ఎపిసోడ్, కృష్ణుడి ప్రస్తావన.. సినిమా బ్లాక్ బస్టర్ Advertisement హనుమాన్.. సినిమా ఓకె కానీ.. చివర్లో వచ్చిన గూజ్ బంప్స్ మూమెంట్స్ అదిరిపోయాయి.. సినిమా…

కార్తికేయ 2.. సినిమా ఓ మాదిరే కానీ.. అనుపమఖేర్ ఎపిసోడ్, కృష్ణుడి ప్రస్తావన.. సినిమా బ్లాక్ బస్టర్

హనుమాన్.. సినిమా ఓకె కానీ.. చివర్లో వచ్చిన గూజ్ బంప్స్ మూమెంట్స్ అదిరిపోయాయి.. సినిమా బ్లాక్ బస్టర్

కల్కి.. ఓ ఫార్ములా కథకు మైథలాజికల్ టచ్.. సినిమా బ్లాక్ బస్టర్

మైథలాజికల్… గాడ్.. గాడెస్  ప్రస్తావన.. ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ సక్సెస్ ఫార్ములా. సోషియో ఫాంటసీ సినిమాలు మనకు కొత్త కాదు. కానీ వాటిని మన పురాణాలకు, పురాణ పాత్రలకు ముడి పెట్టడం ఇప్పుడు ట్రెండ్.

తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది అన్నట్లుగా, ఇప్పుడు జనాల్లో భక్తి బాగా పెరిగింది. గుళ్లు, గోపురాలు కిటకిట లాడుతున్నాయి. లేటెస్ట్ జనరేషన్ కు పురాణాలు అంటే అమర్ చిత్ర కథలే తప్ప, అంతకు మించి పెద్దగా తెలియదు. అందువల్ల అవే కథలను అంగుళం అటు ఇటు జరిపినా సమస్య కాదు.

రెగ్యులర్ ఫార్మాట్ కథలకు పురాణాలను ముడివేస్తే చాలు.. సూపరెహె.

ఓ విలన్.. కలకాలం బతకాలని వుంది. దానికి మందు కావాలి. ఆ మందు మహిళల కడుపులో పిండాల నుంచి తయారు చేసిన సీరమ్ నుంచి వస్తుంది. అందుకోసం ప్రయోగాలు. ఓ అమ్మాయి ఆ ప్రయోగశాల నుంచి తప్పించుకుంది. ముందుగా హీరో నెగిటివ్ థాట్ తో ఆ అమ్మాయిని విలన్ కు అప్పగించాలి అనుకున్నాడు. తరువాత మళ్లీ మనసు మార్చుకుని విలన్ ను ఢీకొన్నాడు.

ఇలా చెబితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ అవుతుంది. కానీ అందులోని ప్రతి పాత్రకు పురాణాల్లోన పాత్రలు మళ్లీ పుట్టినట్లు ముడిపెడితే, సక్సెస్ ఫుల్ ఫార్ములా అవుతుంది.

ఇకపై ఈ దిశగా కథా రచయితలు దృష్టి సారిస్తారు. కొన్నాళ్ల పాటు ఇక ఈ పార్ములా నడిచే అవకాశం వుంది. ఆ తరువాత మళ్లీ ఎవరో ఏదో కొత్త పుంత తొక్కాలి. అప్పుడు మళ్లీ మరో ట్రెండ్. ప్రస్తుతానికి ఇదీ సంగతి.