క.. కిరణ్..కొత్త రూటు

కిరణ్ అబ్బవరం.. కొత్త రూటులోకి వచ్చారు. ‘క’ అంటూ ఓ సినిమాను అందించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఈ జనరేషన్ జనాలు ఇష్టపడే జానర్ ను, కంటెంట్ ను తీసుకుని…

కిరణ్ అబ్బవరం.. కొత్త రూటులోకి వచ్చారు. ‘క’ అంటూ ఓ సినిమాను అందించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఈ జనరేషన్ జనాలు ఇష్టపడే జానర్ ను, కంటెంట్ ను తీసుకుని సినిమా చేసినట్లు కనిపిస్తోంది. అడవి మధ్య ఊరు.. అలుముకున్న చీకటి.. వెలిగిన దివ్వెలు.. కాలచక్రం.. తనెవరో తనకే తెలియని హీరో ఇలా చాలానే చెప్పారు చిన్న టీజర్ లో.

‘క’ అని చిత్రమైన టైటిల్ పెట్టారు. కిరణ్ అబ్బవరం అనో, కృష్ణాపురం అనో చాలా అర్థాలే వున్నాయి. కానీ అసలు అర్ధం సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుందట. ఏమైతేనే క అంటే కొత్త రూటు ఏమో.. సరైన సినిమా పడక కిందా మీదా అవుతున్న కిరణ్ అబ్బరానికి ఇప్పుడు ఆ రూటు దొరికినట్లు కనిపిస్తోంది.

కొత్త దర్శకుల జంట సుజిత్, సందీప్ ఈ సినిమాను అందిస్తున్నారు. టీజర్ లో పడిన విజువల్స్ బాగున్నాయి. టీజర్ క్వాలిటీ బాగుంది. శామ్ సిఎస్ అందించిన స్కోర్ బాగుంది.

మొత్తం మీద టీజర్ ప్రామిసింగ్ గా వుంది. జనాలకు కావాల్సింది అందిస్తున్నట్లు వుంది. మొత్తం మీద కిరణ్ అబ్బవరం ఓ హిట్ సబ్జెక్ట్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది.