విశ్వంభర.. ముందుగానే మేటర్ చెప్పేస్తారంట?

సినిమాపై అంచనాలు పెంచడం వరకు ఓకే. లేనిపోని అంచనాలు పెంచుకుంటే సమస్య. చాలా సినిమాల విషయంలో ఇది జరిగింది కూడా. ఏవేవో ఊహించుకొని సినిమాకెళ్లిన ప్రేక్షకుడు భంగపడిన దాఖలాలు చాలా ఉన్నాయి. విశ్వంభర విషయంలో…

సినిమాపై అంచనాలు పెంచడం వరకు ఓకే. లేనిపోని అంచనాలు పెంచుకుంటే సమస్య. చాలా సినిమాల విషయంలో ఇది జరిగింది కూడా. ఏవేవో ఊహించుకొని సినిమాకెళ్లిన ప్రేక్షకుడు భంగపడిన దాఖలాలు చాలా ఉన్నాయి. విశ్వంభర విషయంలో ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని భావిస్తున్నాడు దర్శకుడు వశిష్ఠ.

చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల తర్వాత చిరు చేస్తున్న సోషియో ఫాంటసీ ఇది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయినా ఆ అంచనాలు మరింతం పెంచకుండా, సినిమా థీమ్ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయబోతోందట యూనిట్.

అవును.. విశ్వంభర సినిమా నుంచి త్వరలోనే ఓ చిన్న వీడియోను విడుదల చేయబోతున్నారని టాక్. ఈ వీడియోలో సినిమా థీమ్ ఏంటనేది చెబుతారంట. అలా సినిమాపై సరైన అంచనాలు సెట్ చేయాలని భావిస్తున్నారట. ఓ చిన్న టీజర్ ను రిలీజ్ చేసి అంచనాలు సెట్ చేయడంతో పాటు… విడుదల తేదీపై మరోసారి స్పష్టత ఇవ్వడం టార్గెట్ గా కనిపిస్తోంది.

చిరంజీవి-త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా సాగుతోంది