ఏఆర్ రెహ్మాన్ ను ఎందుకు పక్కనపెట్టారు?

భారతీయుడు-2 సినిమా ప్రకటన వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అందర్లో కామన్ గా తలెత్తిన ప్రశ్న ఇదే. భారతీయుడు సినిమాకు అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రెహ్మాన్ ను సీక్వెల్ కోసం ఎందుకు పక్కనపెట్టారనేది…

భారతీయుడు-2 సినిమా ప్రకటన వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అందర్లో కామన్ గా తలెత్తిన ప్రశ్న ఇదే. భారతీయుడు సినిమాకు అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రెహ్మాన్ ను సీక్వెల్ కోసం ఎందుకు పక్కనపెట్టారనేది ప్రశ్న.

ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించాడు దర్శకుడు శంకర్. భారతీయుడు-2 ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ఈ దర్శకుడు.. రెహ్మాన్ చాలా బిజీగా ఉండడం వల్లనే భారతీయుడు-2 కోసం తీసుకోలేకపోయామని వెల్లడించాడు.

భారతీయుడు-2 ప్రాజెక్టు అనుకున్న టైమ్ లో 2.O పనిలో రెహ్మాన్ బిజీగా ఉన్నాడట. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ సినిమా కోసం రెహ్మాన్ రాత్రిపగలు వర్క్ చేశాడట. అదే టైమ్ లో కమల్ హాసన్ కాల్షీట్లు ఇచ్చారట. దీంతో అయిష్టంగానే రెహ్మాన్ ను పక్కనపెట్టాల్సి వచ్చిందంటున్నాడు శంకర్.

ఇక్కడే ఆయన మరో మాట కూడా అన్నారు. వ్యక్తిగతంగా అనిరుధ్ సంగీతం అంటే శఁకర్ కు బాగా ఇష్టమంట. ఆ ఇష్టం కూడా భారతీయుడు-2 లోని అతడ్ని తీసుకోవడానికి ప్రధాన కారణంగా మారిందని కూడా అంటున్నాడు.