కల్కి ఆ ఘనత సాధిస్తుందా?

కల్కి సినిమా ఆల్రెడీ హిట్టయింది. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే ఇది రికార్డుల్లో ఏ స్థానానికి చేరుకుంటుందనేది అందరి ప్రశ్న. ఇటు ఇండియాలో, అటు ఓవర్సీస్ లో కల్కి సృష్టించబోయే రికార్డుల…

కల్కి సినిమా ఆల్రెడీ హిట్టయింది. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే ఇది రికార్డుల్లో ఏ స్థానానికి చేరుకుంటుందనేది అందరి ప్రశ్న. ఇటు ఇండియాలో, అటు ఓవర్సీస్ లో కల్కి సృష్టించబోయే రికార్డుల గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే 10 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో చెప్పుకోదగ్గ రికార్డులే సాధించింది. భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల జాబితాలోకి చేరింది. నార్త్ బెల్ట్ లో ఈ సినిమా దుమ్ముదులుపుతోంది. నిన్నటి వసూళ్లతో కలిపి కల్కి హిందీ వెర్షన్ కు ఏకంగా 195 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఈ ఏడాది సినిమాల్లో హయ్యస్ట్ గ్రాసర్ ఫైటర్. ఆ సినిమాకు 215 కోట్ల రూపాయలొచ్చాయి. ఈ రికార్డ్ ను మరో 2 రోజుల్లో కల్కి క్రాస్ చేస్తుందని అంచనా.

అటు ఓవర్సీస్ లో టాప్-5 లిస్ట్ లోకి ఎగబాకింది కల్కి. తాజాగా యూఎస్ లో జవాన్ సినిమా లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించిన కల్కి, ప్రస్తుతం 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. మరి ఈ సినిమా బాహుబలి-2ను అధిగమిస్తుందా?

ప్రస్తుతం ఓవర్సీస్ లో నంబర్ వన్ సినిమా బాహుబలి-2 మాత్రమే. ఈ సినిమాను బీట్ చేయాలని చాలా సినిమాలు ట్రై చేశాయి. కానీ క్రాస్ చేయడం మాట అటుంచి కనీసం 20 మిలియన్ డాలర్ల మార్క్ ను కూడా అందుకోలేకపోయాయి.

చివరికి రాజమౌళి కూడా తన రీసెంట్ మూవీ ఆర్ఆర్ఆర్ తో బాహుబలి-2ను బ్రేక్ చేయలేకపోయాడు. అలా ఆర్ఆర్ఆర్ తో పాటు.. పఠాన్, జవాన్, దంగల్ లాంటి చాలా సినిమాలు బాహుబలి-2 వెనకే ఉండిపోయాయి. ఇన్నాళ్లకు కల్కి వచ్చింది.

ఈ సినిమా ఊపు చూస్తుంటే, ఈజీగా 20 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యేలా కనిపిస్తోంది. మరి అదే ఊపులో బాహుబలి-2ను క్రాస్ చేస్తుందా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. సినిమా విడుదలై 10 రోజులైనప్పటికీ, ఓవర్సీస్ లో కల్కి క్రేజ్ అలానే ఉంది. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.