రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడరా సామీ. ఈ సినిమాకు ఎక్కడలేని ప్రచారం వచ్చింది. దీనికి కారణం ఇందులో హీరోయిన్ గా నటించిన మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని, లావణ్య ఆరోపించడమే. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఎంక్వయిరీ మొదలైంది.
ఓవైపు వివాదం ఇలా నడుస్తుంటే, మరోవైపు తిరగబడరాసామి సినిమాకు విడుదల తేదీ ప్రకటించారు. ఇదే ఊపులో రిలీజ్ చేస్తే సినిమాకు మైలేజీ వస్తుందని మేకర్స్ ఆలోచన కావొచ్చు. ఈ సినిమాను ఆగస్ట్ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
మరి రాజ్ తరుణ్ ప్రచారానికి వస్తాడా..?
ఇప్పటివరకు తన సినిమాలకు అన్నీ తానై ప్రచారం చేశాడు రాజ్ తరుణ్. ప్రతి సినిమాకు కష్టపడ్డాడు. మరి ఈ సినిమాకు అతడు ప్రచారం నిమిత్తం మీడియా ముందుకు వస్తాడా? ఒకవేళ వస్తే మీడియా సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు సింపుల్. రిలీజ్ టైమ్ కు వివాదం చల్లారితే రాజ్ తరుణ్ ప్రచారం మొదలుపెడతాడు. అప్పటికి వివాదం మరింత ముదిరితే మాత్రం ప్రమోషన్స్ కు డుమ్మా కొడతాడు. ఇక్కడే ఓ మధ్యేమార్గం కూడా ఉంది. మీడియా ముందుకు రాకుండా, యాంకర్ తో ఇంటర్వ్యూ చేసి, దాన్ని మీడియాకు వదలొచ్చు.
మొత్తం బయటపెట్టిన లావణ్య..
మరోవైపు ఈ వివాదానికి సంబంధించి పైపైన మాట్లాడిన లావణ్య, ఎప్పుడైతే పోలీసులు సాక్ష్యాలు అడిగారో మొత్తం బయటపెట్టింది. రాజ్ తరుణ్ తో మాట్లాడిన 122 ఆడియో ఫైల్స్ ను పోలీసులకు అందించింది. దీంతో పాటు.. రాజ్ తరుణ్ తో దిగిన దాదాపు 700 ఫొటోల్ని కూడా సమర్పించింది. ఇందులో కాస్త క్లోజ్ గా ఉన్న పిక్స్ కూడా ఉన్నాయట.
ఇవి కాకుండా.. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడంటూ, మరికొన్ని ఫొటోల్ని కూడా పోలీసులకు అప్పగించింది. ఆ మెడికల్ రిపోర్ట్ ను కూడా అందించింది. ప్రస్తుతం ఈ కేసులో రాజ్ తరుణ్ ను ఏ1 నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా అతడి సోదరుడ్ని చేర్చి విచారణ మొదలుపెట్టింది.