Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

ప్రధాని మోడీ ‘నీచ’ రాజకీయాలు!

ప్రధాని మోడీ ‘నీచ’ రాజకీయాలు!

ప్రధాని నరేంద్ర మోడీకి ఓ అద్భుతమైన బ్రహ్మాస్త్రం దొరికింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మీద ఎడా పెడా చెలరేగిపోగలరు. ఎలా చెలరేగిపోవాలో... ఎలాంటి ప్రతిస్పందన ద్వారా.. సామాన్యుడి ఆవేశ కావేషాలను ఎలా రెచ్చగొట్టాలో... ఎలా సామాన్యుడి అభిమానాన్ని ఉద్వేగాలను తనకు అనుకూలంగా మలచుకోవాలో... మోడీకి చాలా బాగా తెలుసు. ఇప్పుడు మరోమారు అదే టెక్నిక్ ను ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించబోతున్నారు. ఆయనను ‘నీచ వ్యక్తి’గా పేర్కొంటూ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు .. ఎన్నికల ప్రచారానికి చివరిరోజున.. మోడీకి చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి. ఆయన ఇక చెలరేగిపోతున్నారు.

అయితే... ‘నీచ’ అనే పదం చుట్టూ ప్రధాని మోడీ ప్రస్తుతం నడిపిస్తున్న రాజకీయాలు చాలా చిత్రమైనవి. నిజానికి ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ముగిసిపోయింది గానీ.. ఈ పదం పుణ్యమాని. .. ప్రచారానికి మించిన చర్చను, ఉప-ప్రచారాన్ని ఆన్ లైన్ వేదికగా సాగించేందుకు... తన ప్రతిస్పందనగా వ్యాఖ్యలు రువ్వుతూ.. ప్రజల భావోద్వేగాలను ఎన్నికల్లో అనుకూలంగా మలచుకునేందుకు మోడీకి ఒక చక్కటి అవకాశం లభించింది. అక్కడే ప్రధాని మోడీ అనుసరిస్తున్న రాజకీయ సంకుచిత వ్యూహాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

మణిశంకర్ అయ్యర్.. ప్రధానిని నీచ వ్యక్తిగా పేర్కొంటూ చాలా పెద్ద తప్పిదమే చేశారు. అందుకు ఆయన మూల్యం చెల్లించుకున్నారు. అంతటి సీనియర్ రాజకీయ వేత్త కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అదంతా నాణేనికి ఒకవైపు. ఆ మాటలను మోడీ ఎలా వాడుకుంటున్నారన్నది రెండో వైపు.

‘‘అయ్యర్ మాటలు గుజరాత్ కే అవమానం’’ అని  మోడీ అంటున్నారు. ఇది చాలా నీతి బాహ్యమైన సంకుచిత ప్రయోజనాల్ని ఆశిస్తున్న మాట. ఎందుకంటే.. ప్రధాని మోడీని దూషిస్తే.. అది యావత్తు దేశంలోని నిమ్నవర్గాలను దూషిస్తూ అన్నమాట కిందే లెక్క. ఆ మాట అన్నందుకు అయ్యర్ ను యావత్తు దేశంలోని నిమ్న వర్గాల వారు తిరస్కరించాలి. నరేంద్రమోడీ తాను ఈ దేశానికి చెందిన వ్యక్తిని అని గుర్తించాలి. కానీ.. ఆయన తనను ఇంకా ‘గుజరాతీ’గానే గుర్తించుకుంటున్నారు. ఈ ‘నీచ’ పదాన్ని గుజరాతీలకు అన్వయించి.. గుజరాత్ కు ఇది అవమానం అని బిల్డప్ ఇస్తూ అక్కడ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. నిజానికి ఆ అయ్యర్ కామెంట్ గుజరాతీలకు కాదు.. యావత్తు దేశంలోని పేదలకు అవమానకరమైన వ్యాఖ్యగా మోడీ అభివర్ణిస్తే.. హుందాగా ఉండేది. కానీ.. ఆయన నీచ పదాన్ని గుజరాత్ లో లబ్ధికి వాడుకోవడానికి చూస్తున్న తీరు గర్హనీయంగానే ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?