Advertisement

Advertisement


Home > Articles - Special Articles

డెత్‌ మిస్టరీ.. ది కంక్లూజన్‌.!

డెత్‌ మిస్టరీ.. ది కంక్లూజన్‌.!

''శ్వాస అందని పరిస్థితుల్లో జయలలితను మేం కనుగొన్నాం.. ఆమెను ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించాం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమిచ్చాం.. దురదృష్టవశాత్తూ ఆమె గుండెపోటుతో మృతి చెందారు..'' 

జయలలిత డెత్‌ మిస్టరీపై తాజాగా వెలుగులోకి వచ్చిన 'ఎయిమ్స్‌' నివేదిక సారాంశమిది. 

''హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సహా, పలువురు మరణించారు.. ఇది కేవలం ప్రమాదం మాత్రమే..'' 

- వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం బయటకొచ్చిన డీజీసీఏ నివేదిక సారాంశమిది. 

కొత్త హెలికాప్టర్‌ అందుబాటులో వుండి మరీ, పాత హెలికాప్టర్‌లో వైఎస్‌ ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది.? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అలాగే, జయలలిత డెత్‌ మిస్టరీకి సంబంధించి సవాలక్ష ప్రశ్నలున్నాయి తప్ప, వాటిల్లో దేనికీ సమాధానం రాలేదు. 'ఎయిమ్స్‌' నివేదిక ఇచ్చిందంటే, బయట ప్రచారంలో వున్న అనుమానాల్లో కొన్నిటికైనా నివృత్తి కలిగేలా అది వుండాలి కదా.! 

'పోయెస్‌ గార్డెన్‌లో గొడవ జరిగింది.. జయలలిత కిందపడ్డారు.. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు..' అంటూ, అన్నాడీఎంకే పార్టీలోనే కొందరు (శశికళ వర్గం కానివారు) పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 'మాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది.. ఎమర్జన్సీ కాల్‌ అది..' అంటూ అపోలో ఆసుపత్రి - ఎయిమ్స్‌ ఇచ్చిన నివేదికలో ప్రస్తావించారంటే, పోయెస్‌ గార్డెన్‌లోనే ఏదో 'కుట్ర' జరిగి వుండాలి. 

ఇక, ఓ ముఖ్యమంత్రి రెండు నెలలకు పైగా ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతోంటే, ఆ చికిత్స వివరాలు అప్పుడెందుకు బయటకు రాలేదు.? అప్పట్లో జయలలిత ప్లేస్‌లో అన్ని అధికారాల్నీ పర్యవేక్షిస్తున్న పన్నీర్‌సెల్వంకి సైతం, జయలలితను చూసే అవకాశం ఎందుకు దక్కలేదు.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు ఎయిమ్స్‌ - అపోలో ఇచ్చిన నివేదిక జస్ట్‌ ఓ చిత్తు కాగితంలానే మిగిలిపోతుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

త్వరలో పన్నీర్‌ సెల్వం, జయలలిత మరణానికి సంబంధించిన మిస్టరీ వీడాలనీ, ప్రభుత్వం స్పందించాలనీ డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టనున్న వేళ అపోలో తరఫున ఎయిమ్స్‌ నుంచి నివేదిక రావడం, అది కూడా అర్థం పర్థం లేని నివేదిక రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?