Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పిక్‌ టాక్‌: దొంగ దర్జా.!

పిక్‌ టాక్‌: దొంగ దర్జా.!

ఫొటోలో ఉన్నోడు మామూలోడు కాదు. ఒకప్పుడు ఆయన చుట్టూ పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలుండేవారు.. అందాల భామలతో 'మజా' చేసేవాడు. అతని చెయ్యి పడితే చాలు ఏ హీరోయిన్‌ దశ అయినా తిరగాల్సిందే. ఏ హీరో అయినా ఆయన ప్రాపకం కోసం పాకులాడాల్సిందే. ఏ రాజకీయ నాయకుడైనాసరే, ఆయన ఆశీర్వాదం పొందాల్సిందే. ఆయనిచ్చే తాయిలం తీసుకోవాల్సిందే.! 

కింగ్‌ ఫిషర్‌ సంస్థ అధినేత విజయ్‌ మాల్యా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే, ఆయన 'లీలలు' అలాంటివి మరి. వందల కోట్లు, వేల కోట్లు ఆర్జించిన విజయ్‌ మాల్యా, ఆ సొమ్ముని ఖర్చు చేయడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకునేవాడు. అలా బ్యాంకుల్ని ముంచేసి, విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా, ఇప్పుడక్కడ ఇదిగో ఇలా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. 

భారతదేశంలో విజయ్‌ మాల్యాపై చాలా కేసులున్నాయి.. అరెస్టు వారెంట్లు కూడా వున్నాయి. కానీ, వున్నది విదేశాల్లో కదా.. అందుకే, అతన్ని మన చట్టాలు ప్రస్తుతానికైతే ఏమీ చేయలేకపోతున్నాయి. అన్నట్టు, అంత దర్జాగా ఈ 'దొంగ' విదేశాలకెలా పారిపోయాడు.? అన్నదే కదా మీ డౌట్‌.! కాంగ్రెస్‌ హయాంలో ఈ దొంగని పెంచి పోషిస్తే, బీజేపీ హయాంలో ఈ దొంగని దేశం దాటించేశారు కొందరు పొలిటికల్‌ పెద్దలు. అదీ అసలు కథ.! 

అన్నట్టు, విజయ్‌ మాల్యాని చట్ట సభలకూ పంపించారండోయ్‌. దేశాన్ని ఉద్ధరించేయాల్సిన ప్రజా ప్రతినిథి దొంగలా విదేశాలకు పారిపోయాడంటేనే, మనోడి 'టాలెంట్' ఏంటో అర్థమవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?