Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రెడ్‌ అలర్ట్‌: అబ్బాయిలకి రక్షణ ఏదీ.?

రెడ్‌ అలర్ట్‌: అబ్బాయిలకి రక్షణ ఏదీ.?

మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నాం. కానీ, మరో భయంకరమైన ప్రమాదం భారతీయ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. చాపకింద నీరులా ఈ ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది. మొన్నామధ్య హైద్రాబాద్‌లో ఓ మైనర్‌ యువకుడు, ఓ చిన్నారిని హత్య చేసి శవం కూడా కన్పించకుండా మాయం చేసేశాడు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మైనర్‌ యువకుడు, ఆ చిన్నారిపై (పసిపిల్లాడు) అఘాయిత్యానికి పాల్పడ్డాడని. 

ఇంకాస్త లోతుగా ఈ కేసుని విచారించిన పోలీసులు, భయం గొలిపే వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. సదరు మైనర్‌ యువకుడు కూడా లైంగిక దాడి బాధితుడేననీ, అలా ఆ కుర్రాడిపై కొందరు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడి చేయడం, ఆ కుర్రాడూ 'అసహజ శృంగారం' అలవాటు చేసుకుని, పసిపిల్లల్లలపై ఆ అకృత్యాన్ని ప్రదర్శిస్తున్నాడని తేలింది. ఆ యువకుడు, పలువుర్ని ఇలాగే లైంగిక దాడికి గురిచేసి చంపేశాడని పోలీసులు నిర్ధారించారు. 

తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ స్కూల్‌ బస్‌ కండక్టర్‌, ఆ స్కూల్‌ విద్యార్థిపై లైంగిక దాడికి యత్నించాడు. అది కుదరక, ఆ విద్యార్థిని చంపేశాడు ఆ కండక్టర్‌. మృతి చెందిన పిల్లాడి వయసు కేవలం 7 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడీ ఘటనతో దేశ రాజధాని అట్టుడికిపోతోంది. ఈ ఘటన తర్వాత, అమ్మాయిల విషయంలోనే కాదు, ఇకపై అబ్బాయిల విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన దుస్థితి దాపురించిందన్నమాట. 

స్వలింగ సంపర్కం అసలు నేరమే కాదన్న వాదనలు విన్పిస్తున్న వేళ, అబ్బాయిలపై జరుగుతున్న ఈ లైంగిక దాడులు కొత్త గుణపాఠాల్ని నేర్పిస్తున్నాయని చెప్పక తప్పదు. అఫ్‌కోర్స్‌.. పైశాచికత్వానికి ఆడా, మగా అన్న తేడాల్లేవనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో వికృత పోకడలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న దరిమిలా, ఈ పశువాంఛ - రాక్షస క్రీడలకు ఫుల్‌ స్టాప్‌ పడి తీరాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?