Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అదిరింది.. వారం వెనక్కు

అదిరింది.. వారం వెనక్కు

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా అదిరింది. దీపావళి సందర్భంగా ఈరోజు విడుదలయింది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ మాత్రం విడుదల కాలేదు. 26న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

వాస్తవానికి తమిళ్ వెర్షన్ మెర్సాల్ తో పాటే తెలుగు వెర్షన్ కూడా విడుదల కావాల్సివుంది. కానీ తమిళ వెర్షన్ సెన్సార్ నే చాలా లేట్ అయింది. ఆనిమల్ బోర్డు తదితర వ్యవహారాల కారణంగా ఆలస్యం తప్పలేదు. 

దీంతో తెలుగు సెన్సారు కు వీలుపడలేదు. అక్కడి సెన్సారు సర్టిఫికెట్ రాగానే, తెలుగు సెన్సారు చేయిద్దామంటే సెలవులు అడ్డం పడ్డాయి. అందుకే ఇక ఎందుకు హడావుడి అని, వచ్చేవారానికి వాయిదా వేయాలని తెలుగు వెర్షన్ హక్కులు తీసుకున్న నిర్మాత శరత్ మరార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అదిరింది సినిమా తమిళ్ వెర్షన్ కు దాదాపు ఫరవాలేదనే టాక్ వచ్చింది. దీంతో కాస్త మంచిగా పబ్లిసిటీ అదీ చేసి, తెలుగు వెర్షన్ విడుదల చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?