Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అల్లుడి సినిమాకు మెగా పెట్టుబడి?

అల్లుడి సినిమాకు మెగా పెట్టుబడి?

పెళ్లయిన దగ్గర నుంచే మెగా అల్లుడు తెర మీదకు వస్తాడని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఆ వార్తలకు తగినట్లుగానే కళ్యాణ్ కనుగంటి హీరోగా సాయి కొర్రపాటి నిర్మాతగా సిన్మా వార్త బయటకు వచ్చింది.

ఇదే చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. హీరో బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, మెగా క్యాంప్ హీరోతో, బాలయ్య క్యాంప్ నిర్మాత సినిమా నిర్మాణం అన్నది కాస్త సర్ప్రయిజ్ పాయింట్ అయింది. అయితే కథను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విని ఓకె చేసారని, బాగా ప్రొడ్యూస్ చేయమని చెప్పారని కూడా కంటిన్యూటీ వార్తలు వడ్డాయి.

అయితే లేటెస్ట్ గా ఇండస్టీలో వేరే గుసగుస వినిపిస్తోంది. అల్లుడిగారి సినిమాకు పెట్టుబడి మెగా క్యాంప్ దే అన్నది ఆ గుసగుసల సారాంశం. సినిమాకు అయ్యే ఖర్చులో పాతిక శాతం నిర్మాత సాయి కొర్రపాటిది, ముఫ్పాతిక శాతం మెగా క్యాంప్ నుంచి వస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు మాటలు జరిగాకే సాయి కొర్రపాటి నిర్మాణానికి పూనుకున్నారని తెలుస్తోంది. 

అంతా బాగానే వుంది. కానీ ఈ ప్రాజెక్టు సాయి కొర్రపాటి చేతికి ఎలా వచ్చిందన్నది మరో ప్రశ్న. ఎందుకంటే ఆయన మెగా క్యాంప్ తో టచ్ లో వుండని మనిషి కదా? అయితే సాయి కొర్రపాటి ఆత్మబంధువు, నేస్తం రాజమౌళి ద్వారా ఇది సానుకూలమైనంది మరో టాక్ వినిపిస్తోంది. చిరు ఓ మాంచి సబ్జెక్ట్ తో అల్లుడిని లాంచ్ చేయడానికి చూస్తున్నారని తెలియడం, వెంటనే తన దగ్గర వున్న సబ్జెక్ట్ ను డైరక్టర్ ను తీసుకెళ్లి ఒకె చేయించుకోవడం జరిగిపోయిందని వినికిడి.

ఇదిలా వుంటే మామూలుగానే మెగా సినిమాల మీద చిరంజీవి క్వాలిటీ చెక్ అడుగు అడుగునా వుంటుంది. అలాంటిది అల్లుడు సినిమా, పైగా పెట్టుబడి పెడుతున్నారు అంటే ఇక ఫుల్ కంట్రోల్ లో వుంటుందేమో? వ్యవహారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?