Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమ్మకాలా? అడ్వాన్స్ లా? ఏది నిజం?

అమ్మకాలా? అడ్వాన్స్ లా? ఏది నిజం?

ఆ సినిమాకు అక్కడ ఇరవై కోట్లు, ఈ సినిమాకు ఇక్కడ పదిహేను కోట్లు. ఇలా రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. 'ట' బోగట్టా పట్టకుని అనుకోవడమే కానీ చాలా మందికి తెలియంది ఏమిటంటే, ఇన్ సైడ్ జరుగుతున్న వ్యవహారాలు వేరు. బయ్యర్లు ఇప్పుడు మీడియం నుంచి భారీ సినిమాలు మరీ ఎగబడి కొనే స్టేజ్ లో లేరు. గీసి గీసి బేరాలు ఆడుతున్నారు. చిన్న చిన్న సినిమాలను మాత్రం లక్ష, రెండు లక్షలకు కొనే ప్లాన్లు వేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ల ఒప్పందాలు వున్నాయి. అందువల్ల వాటికి ఫీడింగ్ కు ఇవి కావాలి.

అంతే కానీ మీడియం సినిమాలను కొనేసేంత సీన్ లేదు. పైగా నాన్చి, నాన్చి దగ్గరకు తీసుకువచ్చి, ఆ పైన ఎంతో కొంత అడ్వాన్స్ పై విడుదల చేసి, ఆ తరువాత లెక్కల దగ్గర మొహం చాటేయడం కూడా మామూలయిపోయింది. ఏదో ఒక ఏరియా అమ్మడం లేదా, ఇలా అగ్రిమెంట్ చేసుకోవడం, ఇంతకు అమ్మాం, అంతకు అమ్మాం అని చాటింపు వేయించడం. దాని ద్వారా మిగిలిన ఏరియాలైనా అమ్మాలని ప్రయత్నించడం.

కానీ బయ్యర్లు భలే తెలివైన వాళ్లు, వాళ్లకు ఈ డ్రామాలు అన్నీ తెలుసు. అందుకే అలా వెయిట్ చేస్తారు. గతంలో ఎన్నో సినిమాలు ఇంతకు అమ్మారు అంతకు అమ్మారు అన్న వార్తలు పుట్టించాయి. కానీ ఏవీ కూడా చివరకు కమిషన్ల మీద, అడ్వాన్స్ ల మీద నడిచినవే. ఇప్పుడు విడుదల అవుతున్న నాగ్ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం డైరక్ట్ రిలీజ్, ఇప్పటికే విడదలయిన మిస్టర్, విన్నర్, కేశవ ఇలాంటివి అన్నీ చాలా ఏరియాలు డైరక్ట్ రిలీజ్. ఆ మాటకు వస్తే బాహుబలి కూడా కర్ణాటక డైరెక్ట్ రిలీజ్. నైజాం అడ్వాన్స్ మీద విడుదల.

ఇప్పుడు బయ్యర్లు ఎక్కువగా కమిషన్ మీద విడుదల చేయడమే సేఫ్ గా చూసుకుంటున్నారు. హీరో, డైరక్టర్, కాంబినేషన్, బజ్ అన్నీ చూసి, అంతకు ముందు సినిమాల లెక్కలు కట్టి, దానికి కాస్త ఇటుగానే అడ్వాన్స్ ఇచ్చి, ఆపైన విడుదలకు దిగడానికే మొగ్గుచూపుతున్నారు. నిర్మాత కూడా ఇదే పద్దతికి ఓకె అనక తప్పడం లేదు. అలా అంటూనే, మరి కాస్త వీలయినంత లాగడానికి చూస్తున్నారు. ఎందుకంటే సినిమా విడుదలయిన తరువాత మరి అదనంగా రావడం అన్నది వట్టిమాటే. బాహుబలి వన్ కే అలా రాలేదు. 

అందువల్ల ఇప్పుడు విడుదలవబోయే సినిమాలపై ఇంతకు, అంతకు అమ్మకాలు అంటూ ఏ వార్తలు వినవచ్చినా, అవన్నీ ఇలాంటి షరతులకు లోబడే తప్ప వేరు కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?