Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంత 'దృశ్యం' లేదా?

అంత 'దృశ్యం' లేదా?

దృశ్యం సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ తొలి రోజు ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే వున్నాయి. చిత్రంగా మల్టీ ఫ్లెక్స్ ల సినిమా అని చూసిననాళ్లు అంటుంటే, ఈ వార్త రాసే సమయానికి తొలి రోజు సాయంవేళ ఆటలు అదే మల్టీ ఫ్లెక్స్ ల్లో సగం కూడా ఫిల్ కాలేదు. ఇటీవలి కాలంలో వెంకటేష్ సినిమాలకు ఓపెనింగ్స్ వుండడం లేదు. 

మసాలా సినిమా పరిస్థితి కూడా ఇదే. ఇప్పడు దృశ్యం పరిస్థితీ అలాగే వుంది. మరి మౌత్ టాక్ స్ప్రెడ్ అయి ఏమన్నా ముందుకు వెళ్తుందేమో చూడాలి. నిజానికి సినిమా క్రిటిక్స్ పరంగా బాగున్నా, సెకండాఫ్ లో పోలీసుల టార్చర్, పిల్లల ఏడుపులు వంటి వైనాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కుతాయా అన్నది అనుమానం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?