Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య చేసింది మంచిపని

బాలయ్య చేసింది మంచిపని

నందమూరి మూడో తరం వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ త్వరలో తెరపైకి వస్తాడని వినిపిస్తున్న నేపథ్యంలో, ఆ కుర్రాడు తండ్రి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వ్యవహారించబోతున్నాడన్న వార్త వచ్చింది. బాలయ్య ఏంటీ.. ఇలా చేస్తున్నారు.. ఆ కుర్రాడు హీరో కదా.. డైరక్షన్ తో పనేంటీ అంటూ చిన్నగా సన్నాయి నొక్కులు. కానీ బాలయ్య చేసింది నూటికి నూరు పాళ్లు శభాషైన పనే. 

బడా బడా కార్పొరేట్ సంస్థలు ఏవీ తమ వారసులను నేరుగా సింహాసనంపై కూర్చో పెట్టవు.. ముందుగా ఒక్కో విభాగంలో పని నేర్చుకోమంటాయి. పైగా నాని, రాజ్ తరుణ్ ఇలా చాలా మంది సహాయ దర్శకులుగా సినిమా జీవితం ప్రారంభించినవారే.. దాని వల్ల సినిమా మీద, నటన మీద ఓ అవగాహన ఏర్పడుతుంది. 

బాలయ్య కూడా తండ్రి దగ్గర కొన్నాళ్లు పనిచేసారు. పైగా క్రిష్ లాంటి విషయం, అభిరుచి వున్న దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం అందరికీ రాదు... సో హీరో కావడానికి ముందే బాలయ్య కొడుకును ఈ విధంగా ట్రయిన్ చేయడం అన్నది ముమ్మాటికీ శభాషైన పనే. 

అసలు ఆ మాటకు వస్తే పిల్లల పెంపకంలో బాలయ్య ఇండస్ట్రీలోనే ది బెస్ట్ అని అంటారు. పిల్లలను చాలా పద్దతిగా, క్రమ శిక్షణతో పెంచారు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసారు. పిల్లలు ఎవరూ ఏనాడూ ఎక్కడా పబ్లిక్ లో మిస్ బిహేవ్ చేసినట్లు కానీ, లేదా ఇదేంటీ ఇలా కనిపిస్తున్నారు.. ఇలా చేస్తున్నారు అని కానీ మాట వినపడలేదు. 

బాలయ్య తండ్రి ఎన్టీఆర్ కు పిల్లల పెంపకంలో పాస్ మార్కులే వస్తాయేమో కానీ, బాలయ్యకు మాత్రం నూటికి నూరు మార్కులు వచ్చేస్తాయి,. ఇది మనం చెప్పే మాట కాదు. ఇండస్ట్రీ జనాలకు, బాలయ్య ఇంటితో పరిచయం వున్న జనాలకు తెలిసిన మాట.   

ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా తన వారసుడిని ఈ విధంగా పరిచయం చేయడం జరగలేదనే చెప్పాలి. నేరుగా గోల్డెన్ స్పూన్ చేతికిచ్చి, బంగారు పళ్లెం ముందు కూర్చోపెట్టిన వాళ్లే..

సో.. బాలయ్య ఇప్పుడు కొడుకును సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలు పరిచయం అయ్యే కీలక దర్శకత్వ శాఖలో ట్రైనీగా పెట్టడం అంటే కరెక్ట్ డెసిషన్ అనే అనాలి. ఎందుకంటే మనం ఎక్కడ పనిచేయాలి అనుకుంటామో..ఆ రంగం గురించి క్షుణంగా తెలుసుకోవడం అన్నది మంచిదేగా. కానీ ఒకటీ మరీ బాలయ్య లా భోళాగా, బొత్తిగా లౌక్యం తెలియని వాడిలా తయారుచేయకుండా వుండడం కూడా అవసరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?