Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

'బెంగుళూరు'కు నయన గ్రీన్ సిగ్నల్

'బెంగుళూరు'కు నయన గ్రీన్ సిగ్నల్

బెంగుళూరు డేస్ సినిమా హక్కులు పివిపి సంస్థ తీసుకుని చాలా కాలమైంది. స్టార్ కాస్ట్ సరిగ్గా సెట్ కాలేదు. ఆఖరికి శర్వానంద్, వరుణ్ తేజ హీరోలుగా ఫిక్సయ్యారు. నిత్య మీనన్ ను హీరోయిన్ గా ఓకె చేసారు. కానీ ఇక్కడ ఇంకో కీలక పాత్ర వుంది. నిజానికి మాతృకలో ఆ పాత్రను చేసింది నిత్యామీనన్. ఆమె ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ చేస్తోంది. 

దీంతో సరైన హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు ఆ అన్వేషణ నయన తార దగ్గర ఆగింది. ఆమె ఓకె అనడంతో ఇక సినిమా పట్టాలు ఎక్కడానికి అన్ని వ్యవహారాలు పూర్తయినట్లే. 

ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తారు.  రెండు భాషల్లో తయారయ్యే ఈసినిమా తమిళ వెర్షన్ లో రానా, ఆర్య క‌థానాయ‌కులుగా న‌టిస్తారు. తమిళ వెర్షన్ లో కూడా నయనతార ఇదే పాత్రను పోషిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?