Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతన్య ఆ డైరక్టర్ ను బ్లాక్ చేసాడు

చైతన్య ఆ డైరక్టర్ ను బ్లాక్ చేసాడు

సరైన డైరక్టర్ దొరికితే లటుక్కున పట్టేసుకుని, లైన్లో పెట్టేస్తున్నారు హీరోలు అందరూ. కథలకు డిమాండ్ అలా వుంది. డైరక్టర్ల కొరత అలా వుంది. అందుకే చేతిలో రెండు సినిమాలు వుండి కూడా నాగ్ చైతన్య మరో డైరక్టర్ ను బ్లాక్ చేసి వుంచాడు.

చైతూ ఆల్రెడీ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. మరో సినిమాను చందు మొండేటి డైరక్షన్ లో సగం ఫినిష్ చేసాడు. ఈ రెండు కాక, కోన వెంకట్ టీమ్ తో మరో సినిమా చేసే ఆలోచనలో వున్నాడు. ఇందుకోసం నిన్నుకోరి లాంటి హిట్ సినిమాను ఇచ్చిన డైరక్టర్ శివ నిర్వాణకు ఓకె చెప్పాడు. లైన్, స్క్రిప్ట్ రెడీ చేసుకోమన్నాడు.

ప్రస్తుతం శివ నిర్వాణ ఆ పనిమీద వున్నాడు. ప్రస్తుతం చేతిలో వున్న రెండు సినిమాల తరువాత ఆ సినిమా వుంటుంది. దానికి కోన వెంకట్ భాగస్వామ్యం వుంటుంది. నిర్మాతగా ఎవరు వుంటారో కోన డిసైడ్ చేసే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?