Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూ నవ్వాడు, కానీ చలపతి రావా.. ఈ మాటలేంది?

చైతూ నవ్వాడు, కానీ చలపతి రావా.. ఈ మాటలేంది?

సినిమా షూటింగ్ సెట్స్ మీద కూడా చలపతిరావు బూతు మాటలు ఎక్కువగా మాట్లాడతాడని పేరు. సినిమా వాళ్లే ఆఫ్ ద రికార్డ్ గా ఇలాంటి విషయాలు చెబుతూ ఉంటారు. ఇక ఈవీవీ వంటి వాళ్లు తీసిన సినిమాల్లో అయినా, “నిన్నే పెళ్లాడతా’కు ముందు చలపతిరావు నటించిన బోలెడన్ని సినిమాల్లో అయినా.. ద్వంద్వర్థ సంభాషణలు, రౌడీ పాత్రలు చలపతికి కొట్టిన పిండి. 

మరి మీడియా ముందు అయితే చలపతిలోని ఆ యాంగిల్ అంతగా బయటకు రాలేదు కానీ.. తాజాగా జరిగిన “రారండోయ్ వేడుక చూద్దాం..’ సినిమా ఆడియో విడదల వేడుకలో చలపతిరావు మాటలు పరమ లేకిగా, అసహ్యంగా ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో చలపతిరావు వాగుడు.. వీడియోగా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అమ్మాయిల గురించి యాంకర్ ఏదో ప్రశ్న అడిగితే..  ‘అమ్మాయిల పక్కలోకి పనికొస్తారు..’ అని సెలవిచ్చాడీయన. మరి సినిమాలో రౌడీ పాత్ర మాట్లాడినట్టుగా సినిమా సెట్స్ మీద బూతులు మాట్లాడినట్టుగానే చలపతిరావు మాట్లాడాడు.

చలపతిరావు తన వయసుకు తానే గౌరవం ఇచ్చుకోలేదు. మనవళ్లు, మనవరాళ్లు పెద్దాలైన దశ వయసు మనిషి. అలాంటి వ్యక్తి ఇలానా మాట్లాడేది. అమ్మాయిలంటే పక్కలోకి రప్పించడానికి మించిన సంస్కారం లేదేమో!

ఈ సీనియర్ వాగుడికి ఆ యాంకర్ ఒకడు.. “భలే చెప్పారు సార్..’ అని లేకి బుద్దిని బయటపెట్టుకోగా.. హీరో నాగచైతన్య ఈ జోక్ కు తట్టుకోలేక పడీపడీ నవ్వాడు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?