Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ క్లైమాక్స్ తిరగరాస్తున్నారా...?

స్పైడర్ క్లైమాక్స్ తిరగరాస్తున్నారా...?

మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా రిలీజ్ వాయిదా పడిందనే విషయం పక్కా. జూన్ 23న విడుదల కావాల్సిన ఈ సినిమా జులై లేదా ఆగస్ట్ కు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే సినిమా వాయిదా పడిందనేది ఇక్కడ మేటర్ కాదు, ఎందుకు వాయిదా పడిందనేది ఇంపార్టెంట్. షూటింగ్ లో జాప్యం కారణంగానే స్పైడర్ లేట్ అవుతోందని కొందరంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా టైం పడుతుంది కాబట్టి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారని ఇంకొందరు అంటున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందట.

అవును.. స్పైడర్ సినిమా క్లైమాక్స్ మారుస్తున్నారట. ఇది లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు మరో కొత్త క్లైమాక్స్ రాస్తున్నాడట దర్శకుడు మురుగదాస్. ఇప్పటికే నెరేట్ చేసిన క్లైమాక్స్ మహేష్ కు కూడా నచ్చింది. అందుకే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అయితే సెట్స్ పై ఉంటుండగానే మరో కొత్త క్లైమాక్స్ ను మహేష్ కు వినిపించాడట మురుగదాస్.

తాజాగా మురుగదాస్ చెప్పిన క్లైమాక్స్ విని మహేష్ చాలా థ్రిల్ ఫీలయ్యాడట. ఆ ప్లాట్ ను డెవలప్ చేయమని దర్శకుడ్ని కోరాడట. ఫుల్ లెంగ్త్ లో కొత్త క్లయిమాక్స్ రెడీ అయితే, అప్పుడు నిర్ణయం తీసుకుందామని సూచించాడట. ప్రస్తుతం మురుగదాస్ అదే పనిమీద ఉన్నట్టు తెలుస్తోంది.

స్పైడర్ సినిమాకు ఇప్పటికే భారీగా ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు క్లైమాక్స్ మారిస్తే ఇంకెంత ఖర్చవుతుందోనని టెన్షన్ పడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?