Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్రిస్మస్ కి అజ్ఞాతవాసి ట్రయిలర్?

క్రిస్మస్ కి అజ్ఞాతవాసి ట్రయిలర్?

ఇప్పడే జస్ట్ ఇప్పుడే అజ్ఞాతవాసి టీజర్ వచ్చింది. 19న ఆడియో ఫంక్షన్ పెట్టుకుని, రెండు రోజుల ముందు టీజర్ ఏమిటా అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ అంటే ట్రయిలర్ విడుదల వుంటుంది కదా? కానీ డైరక్టర్ త్రివిక్రమ్, హీరో పవన్ ల అయిడియా వేరు అంటే. అజ్ఞాతవాసి ట్రయిలర్ ను క్రిస్మస్ శుభ సందర్భంగా విడుదల చేయాలని వారు భావించినట్లు తెలుస్తోంది. 

పైగా టీజర్ కట్ చేయడం, విడుదల చేయడం కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు ఇటు ట్రయిలర కట్ చేయడం మీద కూర్చోవాలి. 

కానీ మరో పక్క ఆడియో ఫంక్షన్ హడావుడి వుంది. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. అందువల్ల 19ఆడియో ఫంక్షన్ అయిపోతే, ప్రశాంతంగా మూడు రోజులు టైమ్ తీసుకుని ట్రయిలర్ కట్ చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది. పైగా టీజర్ హడావుడి రెండు మూడు రోజులు వుంటుంది. ఆడియో సాంగ్స్ మరో రెండుమూడు రోజులు హల్ చల్ చేస్తాయి. అప్పుడు ట్రయిలర్ అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?