Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమా విడుదల కాకుండానే మరో చాన్స్

సినిమా విడుదల కాకుండానే మరో చాన్స్

దర్శకుడు మారుతిని ఓ విషయంలో అభినందించాలి. ఓ పక్క తను సినిమాలు డైరెక్ట్ చేస్తూనే, మరోపక్క నిర్మాతగా, సమర్పకుడిగా చిన్న సినిమాలు అనేకం చేస్తూ, బోలెడు మంది కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అలాగే మురళీ కృష్ణ అనే యువ దర్శకుడికి చాన్స్ ఇచ్చి, రోజులు మారాయి అనే సినిమా నిర్మించాడు.

ఆ సినిమా ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్ చూసి మారుతి చాలా హ్యాపీగా ఫీలయ్యాడట. ఆ యువ దర్శకుడికి మరోచాన్స్ తనే ఇస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నాడట. వచ్చే నెలలో మారుతి కథ, మాటలు, నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కావాల్సి వుంది. దానికి ఈ మురళీ కృష్ణనే దర్శకుడిగా ఎంచుకుంటున్నట్లు వినికిడి. 

అంటే ఒకే బ్యానర్ లో వరుసగా రెండుసినిమాలు. అదీ ఒక సినిమా ఇంకా పూర్తి కాకుండానే.మారుతి ఇంత భరోసా పెట్టుకున్నాడు అంటే, కుర్రాడి దగ్గర విషయం వుండే వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?