Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమాకు తక్కువ..విలాసాలకు ఎక్కువ

సినిమాకు తక్కువ..విలాసాలకు ఎక్కువ

విజయం అన్నది అయాచితం కాదు. కష్టపడితేనే వస్తుంది. కానీ టాలీవుడ్ లో కొంతమంది కష్టపడి విజయాలు సాధించి, ఆపై విలాసాలకు అలవాటు పడి కెరీర్ పాడు చేసుకుంటారు. తాజాగా ఓ డైరక్టర్ ఉదంతం అదే అంటున్నారు. ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు బాగానే తీస్తాడని పేరున్న ఆ డైరక్టర్ వరుసగా అపజయాలు మూటకట్టుకుంటున్నారు. దీని వెనుక ఆయన అలవాట్లు వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మద్యానికి ఎక్కువగా అలవాటు పడడం ప్రధాన కారణంగా వినిపిస్తోంది. లేట్ నైట్ వరకు మద్యంతోనే గడుపుతారని వినికిడి. అలాగే  అమ్మాయిల సాంగత్యంపై కూడా కాస్త ఆసక్తి ఎక్కువే అని తెలుస్తోంది. కొత్త అమ్మాయిలను సినిమాతో పరిచయం చేసేటపుడే, ప్యాకేజీ మాట్లాడేసుకుంటారని, ఆయన ఓ గెస్ట్ హవుస్ లో మాంచి విలాసవంతమైన రూమ్ వుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇలాంటి వ్యవహారాలన్నింటిలో బిజీ కావడంతో, సినిమాలను ఏదో విధంగా చుట్టేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?