Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డేట్లు పవన్.. స్క్రిప్ట్ త్రివిక్రమ్?

డేట్లు పవన్.. స్క్రిప్ట్ త్రివిక్రమ్?

ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆత్మలో ఆత్మ. అన్నీ ఆయనే. ఇది ఈ మధ్య ఓ డైరక్టర్ కు కూడా అనుభవం అయినట్లు తెలిసింది. పవన్ ఒప్పుకున్న సినిమాల్లో ఒకటి రీమేక్. దాన్ని తెలుగులోకి అనేక మార్పులు చేస్తూ స్క్రిప్ట్ తయారు చేసే పని ప్రారంభమైంది.

ఈ క్రమంలో రెండు మూడు సీన్లు అల్లుకుని, చెబుదామని పవన్ దగ్గరకు వెళ్లారట, ఆ సినిమా చేయబోయే దర్శకుడు. అలా వెళ్తే, సింపుల్ గా పవన్ ఒకటే మాట అన్నట్లు వినిపిస్తోంది.

‘స్క్రిప్ట్ గురించి ఏమైనా మాట్లాడాలంటే, అంతా త్రివిక్రమ్ నే చూసుకుంటారు. ఆయనతో మాట్లాడండి’ అనేసారట. దాంతో మరింకేం అనలేక, ఆ డైరక్టర్ వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కు త్రివిక్రమ్ మీద అపార నమ్మకం వుండొచ్చు. సాన్నిహిత్యం వుండొచ్చు.

కానీ ఓ డైరక్టర్ ను పోయి, మరో డైరక్టర్ కు సీన్లు చెప్పమంటే, కాస్త ఇబ్బందిగానే వుంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కనుక త్రివిక్రమ్ ను తన సన్నిహితుడు కొరటాల శివకు స్క్రిప్ట్ చెప్పమంటే ఎలా వుంటుందీ? ఇది పవన్ ఆలోచించడం కాదు. త్రివిక్రమ్ ఆలోచించాలి, అని దర్శకుల సర్కిళ్లలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే పాపం, ఆ దర్శకుడు ఏం చేయగలడు. బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్లు ఇచ్చాడు. పవన్ తో ఆఫర్ రావడమే అద్భుతం. అందువల్ల ఎవరికి చెప్పమంటే వాళ్లకే కథ చెప్పాలి. సీన్లు చెప్పాలి. పరిస్థితి అదీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?