Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డిస్ట్రిబ్యూషన్ పై దిల్ రాజు విరక్తి

డిస్ట్రిబ్యూషన్ పై దిల్ రాజు విరక్తి

అసలు దిల్ రాజు అంటేనే తొలుత పంపిణీదారుడు. సినిమాలు కొని, పంపిణీ చేసి, ఆపై నిర్మాతగా మారాడు. ఈ రెండింటికితోడు రెండు రాష్ట్రాల్లో బోలెడు థియేటర్లు ఆయన చేతిలోవున్నాయి. అలాంటిది ఇప్పుడు కొన్నాళ్ల పాటు డిస్ట్రిబ్యూషన్ ఆపేస్తే ఎలావుంటుందీ అని ఆలోచిస్తున్నాడట దిల్ రాజు. నిర్మాతగా ఫ్లాపులు, హిట్ లు చూసినట్లే. డిస్ట్రిబ్యూటర్ గా అన్ని తరహా సినిమాలు చూసాడు.

అయితే ఇప్పుడు నైజాంలో రాను రాను పోటీ పెరుగుతోంది. గతంలో అంటే దిల్ రాజు ఎంత అంటే అంతే. కానీ ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ రంగంలోకి దిగి, మార్కెట్ షేక్ చేస్తోంది. పెద్ద సినిమాలకు పోటీ పెరిగింది..లాభాలు తగ్గిపోతున్నాయి..రిస్క్ పెరుగుతోంది. చిన్న సినిమాలు బాగానే కిట్టుబాటు అవుతున్నాయి కానీ, లాభాల కిక్ ఇవ్వడం లేదు. 

అందుకే డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కాస్త తగ్గించి, ఎగ్జిబిటర్ గా, నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాడట. మరీ మంచి, మంచి బేరం దొరికితే ఎలాగూ చేస్తాడు. కానీ గతంలో అంత స్పీడు..నెంబర్ వుండదన్నమాట. అదీ సంగతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?