Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హరీష్ ఆక్రోశం అంతా ట్విట్టర్ పైనే

హరీష్ ఆక్రోశం అంతా ట్విట్టర్ పైనే

దర్శకుడు హరీష్ శంకర్ మొన్నటికి మొన్న అడియో ఫంక్షన్ లో సుదీర్ఘ ప్రసంగం చేసారు. మెషీన్లకు ఎమోషన్లు వుండవని, కేవలం మనుషులకు మాత్రమే ఎమోషన్లు వుంటాయని, ఏదేదో చెప్పుకోచ్చారు. ఇంతకీ హరీష్ శంకర్ ఆక్రోశం, ఆవేదన అంతా దేనికయ్యా అంటే, ట్విట్టర్ మీదనే.

డిజె సినిమా మీద ఆయన కానీ, డీజె టీమ్ కానీ, ఏదైనా ట్వీట్ చేస్తే చాలు, జనాలు విరుచుకుపడిపోతున్నారు. సెటైర్లు వేస్తున్నారు. భయంకరమైన కామెంట్లు చేస్తున్నారు. డిజె బ్లాక్ బస్టర్ అంటే 'ఎక్కడ అస్సాంలోనా' అంటూ వెటకారం చేస్తున్నారు. కలెక్షన్లు బాగున్నాయి అంటే, ' మీరు ఎంత కలెక్షన్లు అయినా పుట్టించేస్తారు' అంటున్నారు. 

ఇలా ట్వీట్టర్ లో హరీష్ ను, డీజె టీమ్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇలా ఆడుకుంటున్న వాళ్లలో మెజారిటీ జనాలు వేరే హీరో ఫ్యాన్స్ అయి వుండొచ్చు. కానీ మరి బన్నీ ఫ్యాన్స్ సంగతేమిటి? వారు ఎందుకు ఆ రేంజ్ లో డిఫెన్స్ కు రావడం లేదు అన్నది తెలియడం లేదు. డిజె సినిమా వరకు వస్తే, మెగా ఫ్యాన్స్ చాలా వరకు బన్నీకి దూరమయ్యారన్నది వాస్తవం.

సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ ను పిలిచి మీటింగ్ లు పెట్టడం అన్నది మెగా సంప్రదాయం. కానీ ఈసారి అలాంటి మీటింగ్ ఏదీ జరిగిన దాఖలాలు కనిపించలేదు. పైగా కొందరు కీలకమైన ఫ్యాన్స్ ను పిలచి,  వీలయితే ఫ్యాన్స్ డబ్బులు వేసుకుని, బెనిఫిట్ షోలు వేసి, ఫస్ట్ డే రికార్డుకు సహకరించమని కోరితే, వాళ్లు నో చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద ట్విట్టర్ లో హరీష్ కు ఎదురుదాడే తప్ప మద్దతు కనిపించలేదు. ఇదే హరీష్ ను చాలా బాదపెట్టినట్లుంది. పైగా దీనికి తోడు రివ్యూలు కూడా నెగిటివ్ గా వచ్చాయి. నిజానికి సమీక్షల్లో ఎవరూ హరీష్ ను కామెంట్ చేయలేదనే చెప్పాలి. కానీ హరీష్ తనను వ్యక్తిగంతంగా కామెంట్ చేసినట్లు బాదపడుతున్నారు. అంటే ఆయన ట్విట్టర్ ను, వెబ్ మీడియాను ఒకటే గాటికీ కట్టి చూస్తున్నట్లు కనిపిస్తోంది.

డిజె కలెక్షన్లు వస్తున్నాయన్నా ట్విట్టర్ జనాలు నమ్మడం లేదు. ఇదంతా బన్నీ టీమ్ క్రియేషన్ అని వారు భావిస్తున్నారు. బన్నీ టీమ్ జనాల పేర్లు కూడా ట్విట్టర్ జనాలకు తెలిసిపోయింది. దాంతో వారు నేరుగా పేర్లతోనే కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఇవన్నీ కలిసి హరీష్ శంకర్ కు బాగానే కోపం తెప్పించినట్లున్నాయి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?