Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జగపతిబాబుని తొక్కేసారేంటి?

జగపతిబాబుని తొక్కేసారేంటి?

ఎంత రజనీకాంత్‌ సినిమా అయితే మాత్రం వంద సినిమాలకి పైగా అనుభవం ఉన్న జగపతిబాబు తన సినిమాలో విలన్‌గా నటించినపుడు అతడికి కూడా ఎంతో కొంత గుర్తింపు ఇవ్వాలిగా? హీరోయిన్లకి ఇచ్చిన ఇంపార్టెన్స్‌ కూడా జగపతిబాబుకి ఇవ్వకపోవడమేంటి? 

రజనీకాంత్‌ ‘లింగ’ చిత్రం ట్రెయిలర్‌లో జగపతిబాబుని పూర్తిగా పక్కన పడేసారు. కేవలం రజనీ మీదే ఫోకస్‌ పెట్టారని సరిపెట్టుకుందామంటే అదీ లేదు. అనుష్క, సోనాక్షి సిన్హా ఇద్దరినీ ప్రత్యేకించి హైలైట్‌ చేసారు. మరి విలన్‌గా నటించిన జగపతిబాబుని ఎందుకు పక్కన పెట్టేసినట్టు? 

రజనీకాంత్‌తో గతంలో ‘కథానాయకుడు’ చిత్రంలో నటించిన జగపతిబాబు ఈసారి విలన్‌గా సూపర్‌స్టార్‌ని సవాల్‌ చేస్తున్నాడు. లెజెండ్‌లో జగపతిబాబు నటన చూసి ఈ పాత్రకి ఏరి కోరి అతడిని ఎంచుకున్నారు. జగపతిబాబు ఏ సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ చేసినా, ప్రత్యేక పాత్ర చేసినా ఖచ్చితంగా అతడికి ఇచ్చే రెస్పెక్ట్‌ అతనికి ఇచ్చేస్తారు. కానీ లింగ టీమ్‌ మాత్రం జగపతిబాబుని పూర్తిగా లైట్‌ తీసుకుని రజనీ జపం చేసింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?