Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జైలవకుశలో పొలిటికల్ డైలాగులు తీసేసారా?

జైలవకుశలో పొలిటికల్ డైలాగులు తీసేసారా?

జై లవకుశలో సందర్భానుసారం కొన్ని పొలిటికల్ డైలాగులు వున్నాయని ముందే బయటకు వచ్చింది. సినిమా విడులయిన తరువాత అలాంటివి ఒకటి రెండు కనిపించాయి.

అయితే అవి డైరెక్ట్ పొలిటికల్ డైలాగులు కాకుండా, ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ అధినేతలకు మధ్య వ్యవహారానికి సంబంధించిన మర్మగర్భంగా వున్నవి కావడంతో అంత ప్రభావం కనబర్చలేదు. 'గెలిపించిన వాడికన్నా గెలిచే వాడికే గౌరవం ఎక్కువ.. పోస్టర్లు అంటించే వాడు పోస్టర్ మీదకు రావడమా... మనం అనేది అబద్దం, నేను అనేది నిజం... మళ్లీ దగ్గర కావాలని నాటాకాలు ఆడుతున్నార్రా.. మనను కేంద్రం గుర్తించింది,' లాంటి డైలాగులు వున్నాయి.

అయితే ఇవి కాక మరి కొన్ని డైలాగులు కూడా సినిమాలో వున్నాయని, వీటిలో కోన్నింటిని సెన్సారు కాపీ ఇవ్వడానికి ముందే తీసేసారని, మరి కొన్నింటిని సెన్సారు టైమ్ లో తీసేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెన్సారు టైమ్ లో అభ్యంతరం పెడితే తీసిన కట్ లు, ఇతర వ్యవహారాలు సర్టిఫికెట్ లో మెన్షన్ చేస్తారు.

అయితే ఈ డైలాగ్ కాస్త అభ్యంతరంగా వుంది అని సెన్సారు జనాలు అనగానే, ముందుగానే స్వచ్చంధంగా తీయడంతో అది లెక్కలోకి రాలేదని తెలుస్తోంది. ఈ డైలాగులో మద్దుతు ఇవ్వడం, పొత్తు పెట్టుకోవడం, ఎలా చెబితే అలా వినడం వంటి అర్థాలు వచ్చేలాంటి డైలాగు వుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

మరోపక్క సినిమా క్లయిమాక్స్ లో, అంతకు ముందు మాజీ ఎంపీని ఉద్దేశించి ఒకటి రెండు పోలిటికల్ డైలాగులతో సీన్ చేసారట. కానీ సినిమా ఫైనల్ కాపీ ప్రిపేర్ చేసుకునే సమయంలో అది తొలగించారని మరో గుసగుస వినిపిస్తోంది. ఎంత వరకు నిజం అన్నది తెలియదు కానీ, మొత్తానికి అన్ని డైలాగులు వుండి వుంటే సినిమాకు మరింత పొలిటికల్ టచ్ వచ్చేదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?