Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్టార్ తండ్రికొడుకులు మళ్లీ కలుస్తారట?

స్టార్ తండ్రికొడుకులు మళ్లీ కలుస్తారట?

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ కలిసి ఒకేసారి వెండితెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో కృష్ణతో కలిసి కనిపించిన మహేష్.. తర్వాత పూర్తిగా తండ్రితో తెరపై కనిపించడం మానేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ముహూర్తం రానే వచ్చింది. మహేష్ అప్ కమింగ్ మూవీలో కృష్ణ కనిపించబోతున్నారట.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్నాడు మహేష్. నిన్నట్నుంచే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలోకి కృష్ణను కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడట కొరటాల. ఇదే విషయాన్ని మహేష్ తో కూడా చర్చించాడట. కాకపోతే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కృష్ణ కోసం అనుకున్న క్యారెక్టర్ కూడా చాలా చిన్నదని తెలుస్తోంది.

మహేష్ హీరోగా మారిన తర్వాత కృష్ణతో కలిసి చేసిన సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయి. హీరోగా చేసిన మొదటి సినిమా రాజకుమారుడు మాత్రం దీనికి మినహాయింపు. ఈ నేపథ్యంలో కొరటాల ప్రాజెక్టులో కృష్ణను తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

అన్నట్టు మహేష్ రెండోసారి ఛాన్స్ ఇచ్చిన దర్శకులంతా (పూరిజగన్నాథ్ తప్ప) ఈ హీరోకు ఫ్లాపులిచ్చారు. ఆ నెగెటివ్ సెంటిమెంట్ కూడా 'భరత్ అనే నేను' ప్రాజెక్టుపై బాగానే ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?