Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లారెన్స్ కూడా 'గంగ'లో 'ముని'గాడా?

లారెన్స్ కూడా 'గంగ'లో 'ముని'గాడా?

బెల్లంకొండ సురేష్ చాకచక్యం ముందు ఎవరు చాల్లేరు. గంగ పంచాయతీ తెగడం లేదు. గంగ డబ్బులు వస్తాయి, బాకీలు తీరుతాయి అని ఒకపక్క అనుకుంటుంటే దానికి సంబంధించి కొన్ని ఏరియాలు ఎప్పడో అమ్మేసి సొమ్ము చేసుకున్నాడని ఇప్పుడు తెలుస్తోందని వినికిడి. 

అలాగే శాటిలైట్ హక్కులు కూడా గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసాడని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ సినిమాకు సంబంధించి లారెన్స్ కు కూడా పెద్దగా మొత్తం అందలేదని, ఏదో కొంచెం అడ్వాన్స్ మాత్రం ఇచ్చారని, టాక్ వినిపిస్తోంది. 

గంగ తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయితే మహా అయితే ఇరవై,పాతిక కోట్లువస్తాయి. దాని కోసం చాలా మంది కాసుకు కూర్చున్నారట. తలా కొంచెమైనా రాకపోతుందా అని? కానీ అసలు పంచాయతీలు తెగి విడుదలవుతుందా అని అనుమానంగా వుందట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?