Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ చేస్తున్న తప్పు

మహేష్ చేస్తున్న తప్పు

సినిమాలు చేయడం వేరు, వాటిని జనంలోకి తీసుకెళ్లడం వేరు. ఈ కళలో మెగా హీరోలు ఆరితేరినంతగా మహేష్ బాబు క్లిక్ కావడం లేదు. ఎప్పుడు మొదలు పెట్టారు మురగదాస్ సినిమాను. తెగ చెక్కుతున్నారు. సరే మురుగదాస్ లాంటి డైరక్టర్ కాబట్టి, ఆ మాత్రం టైమ్ తీసుకుంటారు అని సరిపెట్టుకోవచ్చు. కానీ మరి సినిమా బజ్ సంగతేమిటి? బాహుబలి 2 లాంటి భారీ సినిమానే ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో వుంటోంది సదా.

కానీ మహేష్ సినిమా సంగతి అలా లేదు. ఇంతవరకు అఫిషియల్ గా ఒక్కటంటే ఒక్క ముచ్చట లేదు. టైటిల్ కూడా సంభవామి అన్నది ఫిక్స్ చేసుకున్నారు కానీ, ఇంతవరకు ప్రకటించలేదు.  షూటింగ్ మరో నెలలో పూర్తవ్వోస్తోంది. కానీ ఓ ఫస్ట్ లుక్ లేదు..వర్కింగ్ స్టిల్ లేదు..టీజర్ సమస్యే లేదు.నిన్న మొన్న మొదలైన డిజె టీజర్ వచ్చేసింది. విడదలకు రెడీ అవుతోంది. 

సమస్య మురగదాస్ దగ్గర వుందో, మహేష్ బాబు దగ్గర వుందో కానీ మధ్యలో నిర్మాతకే సమస్య. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తయారవుతున్న సినిమా. ఇప్పటి వరకు అమ్మకాలు స్టార్ట్ కాలేదు. ఒక్క ఫస్ట్ లుక్ ఇచ్చినా, ఒక్క టీజర్ ఇచ్చినా సినిమాకు వచ్చే బజ్ నే వేరుగా వుంటుంది. ఇరవై కోట్లు తీసుకున్న మహేష్ కానీ, మరో ఇరవై కోట్లు తీసుకున్న మురుగదాస్ కానీ నిర్మాత సంగతి పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. 

ఎంత గొప్ప కాంబినేషన్ అయినా, ఎంత గొప్పగా వండి వార్చినా టైమ్ దాటిపోతే ఆసక్తి, రుచి రెండు వుండవు. ఈ సంగతి గమనించి, ఇప్పటి నుంచీ షురూ చేయాలి మహేష్-మురుగదాస్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?